సీఎం కేసీఆర్ 2023 ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తొలి జాబితాను విడుదల చేశారు. అయితే అందులో సిట్టింగ్ స్థానం నుంచి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు స్థానం దక్కలేదు. అక్కడ ఆయన స్థానంలో మాజీమంత్రి కడియం శ్రీహరికి చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సీఎం కేసీఆర్ పై తనకు చాలా నమ్మకం ఉందని.. మొన్న ఓ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహం వద్ద తన కాళ్ల మీ పడి ఏడ్చారు. తాజాగా మళ్లీ హాట్ కామెంట్స్ చేశారు.
Read Also: Milk: ఆరోగ్యానికి మంచిదని పాలు ఎక్కవగా తాగుతున్నారా? వెంటనే ఆపేయండి.
జనగామ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. బీసీ బందు లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరు నూరైనా నా ప్రాణం అడ్డేసి మీ అందర్నీ కాపాడుకుంటానని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోనే ఉంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. భూమి కొని, మొట్టు కొట్టి, దుక్కి దున్ని, నారు పోసి, నాటు వేసి, వరి కోసి, రాశి పోసిన తర్వాత రాశి మీద ఎవరో వచ్చి కూర్చుంటా అంటే నేను ఊరుకుంటానా అని అన్నారు. దుక్కి దున్ని, నారు పోసేటప్పుడు తనతో సహకరిస్తే అది వేరే విషయమన్నారు. ఏది ఏమైనా దేవుడు ఉన్నాడు, దేవుడి లాంటి కెసిఆర్ ఉన్నాడని తెలిపారు. రేపో, మాపో మనం అనుకున్న కార్యక్రమం జరగబోతుందని.. మీ కోసం నేను ఉన్న , మీ మధ్యలోనే చచ్చిపోతానని కీలక వ్యాఖ్యలు చేశారు.