Minister KTR: హైదరాబాద్ వాసులకు మరో వంతెన అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడంలో భాగంగా ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
రాజకీయాల్లో ఉన్నవారు సేవ చేస్తారని ప్రజలు భావిస్తారు. ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజలకు సేవ చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధనవంతులు ప్రజాప్రతినిధులుగా ఎంపికవుతున్నారు.
సిరిసిల్ల అంటేనే గీతన్న, నేతన్న.. ఉదయం కష్టపడే గీతన్న సాయంత్రం గీతన్నను కలుస్తాడు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేవుడు తాగే అమృతంను గీతన్న అందిస్తున్నాడు.. నేతన్న పని చేసి కష్టపడి ఆకలితో అనాడు చనిపోయారు..
కేసీఆర్ కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లాకు అనేక హామీలు ఇచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు సమాధానం చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి.. మేమే పెడతామని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారు కదా.. మీరు పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదు.. మీ కుటుంబం కోసం మాత్రమే.. వరదల వల్ల నష్టపోయిన రైతులకు పది పైసలు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి అన్నారు.
ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేది అని కడియం శ్రీహరి కామెంట్స్ చేశారు. నాకు అవకాశం వస్తే మీరందరూ నన్ను ఆశీర్వదించిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగర వేసుకొని చెప్పే విధంగా నా పనితీరు ఉంటుంది..