Harbhajan Singh: ట్రోఫీని హనుమాన్ ఆలయానికే ఎందుకు తీసుకెళ్లారు? కీర్తి ఆజాద్ ప్రశ్నకు హర్భజన్ స్ట్రాంగ్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harbhajan Singh: టీ20 వరల్డ్ కప్పును భారత్ కైవసం చేసుకుంది. టీమిండియా మూడోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో భారత్ మొత్తం సంబరాలు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీమిండియాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యలో ఈ టీ20 వరల్డ్ కప్పు చుట్టూ కొత్త వివాదం మొదలైంది. ఫైనల్‌లో మ్యాచ్ గెలిచిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్, ఐసీసీ ఛైర్మన్ జైషా కలిసి పక్కన ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లారు. ట్రోఫీతో సహా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడంపై భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ట్రోఫీని కేవలం ఆలయానికే మాత్రమే ఎందుకు తీసుకెళ్లారు? ఇతర మతపరమైన ప్రార్థనా మందిరాలకు ఎందుకు తీసుకెళ్లలేదని ఆజాద్ ప్రశ్నించారు.
READ MORE: CM Chandrababu: రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం.. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలపై సీఎం సమీక్ష!
Also Read
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
కీర్తి ఆజాద్ వ్యాఖ్యలపై తాజాగా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆజాద్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదు. ఆజాద్ వ్యాఖ్యలు దురదృష్టకరం. భారత జట్టు ట్రోఫీని ఆలయానికి, మసీదుకు లేదా చర్చికి ఇలా వాళ్లకు నచ్చిన ప్లేస్‌కు తీసుకెళ్లొచ్చు. తమ వరల్డ్ కప్పు కోరిక నెరవేరినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడంలో తప్పేముంది?. ఒక మాజీ ప్లేయర్ అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు.. కప్పు గెలిచిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఏంటి?” అని హర్భజన్ ప్రశ్నించారు. అన్ని మతాలు ఒకటేనని, ఎవరి విశ్వాసం వారిదని భజ్జీ స్పష్టం చేశారు. మరోవైపు.. కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. సంతోషంగా కప్పు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం పక్కన పెట్టి ఈ వివాదంలో మునిగిపోయారు.
READ MORE: Iran-US: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. హార్ముజ్ జలసంధి దగ్గర 16 ఇరాన్ బోట్లు ధ్వంసం
తాజావార్తలు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!