సిరిసిల్ల అంటేనే గీతన్న, నేతన్న.. ఉదయం కష్టపడే గీతన్న సాయంత్రం గీతన్నను కలుస్తాడు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేవుడు తాగే అమృతంను గీతన్న అందిస్తున్నాడు.. నేతన్న పని చేసి కష్టపడి ఆకలితో అనాడు చనిపోయారు..
కేసీఆర్ కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లాకు అనేక హామీలు ఇచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు సమాధానం చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి.. మేమే పెడతామని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారు కదా.. మీరు పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదు.. మీ కుటుంబం కోసం మాత్రమే.. వరదల వల్ల నష్టపోయిన రైతులకు పది పైసలు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి అన్నారు.
ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేది అని కడియం శ్రీహరి కామెంట్స్ చేశారు. నాకు అవకాశం వస్తే మీరందరూ నన్ను ఆశీర్వదించిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగర వేసుకొని చెప్పే విధంగా నా పనితీరు ఉంటుంది..
Komati Reddy: రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపైన ఉన్నారు..! వారి గురించి సీఎం కేసీఆర్ మాట్లాడరా? అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం యెల్లారెడ్డిగూడెం గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు భూపాల్ పుట్టిన వేడుకల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Harish Rao: ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న అన్నట్టు ప్రతిపక్షాలు చేస్తాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, భూమిపూజ చేశారు.