జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ మాకు ఒక విధానం ఉందని. కేసీఆర్ పార్టీలగా నియంతృత్వ పార్టీ కాదు అని విమర్శించారు. సీఎం అభ్యర్థి విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
Read Also: Praggnanandhaa: రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద తీసుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచమని చెప్పిన కేటీఆర్.. అభ్యర్థుల అందరితో కలిసి తెలంగాణ తల్లి పై ప్రమాణం చేయమని చెప్పండి అని జీవన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని తెలిపారు. ఎక్కువగా డబ్బులు ఖర్చు అయిందని నిరూపిస్తే ప్రజాజీవితం నుండి తప్పుకుంటానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చుపై విచారణ చేయండని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ లాగా ఓటర్లకు తాయిళాలు ఇవ్వలేదని తెలపగా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో ప్రకటనతో పాటు డబ్బు సంచులు కూడా ఇచ్చిందన్నారు. తన మాటకు కట్టుబడి ఉంటా దమ్ముంటే ఎంక్వయిరీ కమిషన్ వేయమనండి అని జీవన్ రెడ్డి అన్నారు.
Read Also: Health Tips : రోజూ ఇదొక్కటి తింటే చాలు..కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..
మరోవైపు రాష్ట్రంలో 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జీవన్ రెడ్డి తెలిపారు. 33 మంది డీఈవోలకు.. కేవలం నలుగురు మాత్రమే పని చేస్తున్నారని విమర్శించారు. పాఠశాలల్లో ఒక టీచర్ పని చేసే.. వారికే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉపాధ్యాయులు బోధన చేయలేక పోతున్నారని ఆయన పేర్కొన్నారు.