Bandi Sanjay: మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రమండలం కూడా ఖతం.. కేసీఆర్పై బండి సంజయ్ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన బండి సంజయ్.. అనంతరం కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిపారు. అంతేకాకుండా.. మహిళా రిజర్వేషన్లపై కేసీఆర్ కు చురకలు అంటించారు. మరోవైపు తమ పార్టీ గ్రాఫ్ పడిపోలేదని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
Donald Trump: ఎక్స్(ట్విటర్) లోకి ట్రంప్ రీ ఎంట్రీ.. ఏం పోస్ట్ పెట్టారంటే?
Also Read
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా ఏంటో తెలుస్తుందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రమండలం కూడా ఖతం అవుతుందని సెటైర్లు వేశారు. చంద్రుని మీద కూడా భూములిస్తామని కేసీఆర్ మాయ మాటలు చెబుతారని ఎద్దేవా చేశారు. మరోవైపు కేసీఆర్ మొన్న ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల సీట్లలో సగం మందికి బీ ఫారాలు దక్కవని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రకటించినవన్నీ ఉత్తుత్తి సీట్లే అని బండి సంజయ్ విమర్శించారు.
Nani: నేషనల్ అవార్డ్స్.. మనసు ముక్కలు అయ్యిందన్న నాని
కేసీఆర్ ఒకరికి సీటు ఇచ్చి, మరొకరిని ఇంటికి పిలిపించి మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ బిడ్డకు సీటు ఇస్తే మహిళలకు 33 శాతం ఇచ్చినట్టేనా అని నిలదీశాడు. మహిళా రిజర్వేషన్, బీసీల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదని దుయ్యబట్టారు. బీసీలకు అన్యాయం జరిగిందని.. అవినీతి జరుగుతుందని ఆరోపించారు. కొందరు ఎమ్మెల్యేలు దళితబంధులో 30శాతం కమిషన్లు తీసుకున్నారు అని కేసీఆరే అన్నారని తెలిపారు. ఆ అవినీతి పరులకు టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
Krishna Express: కృష్ణా ఎక్స్ప్రెస్లో పొగలు.. ప్రయాణికులు సేఫ్
మహిళలను అవహేళన చేయడం మాని 33 శాతం రిజర్వేషన్ బిల్లు పెట్టేందుకు బీజేపీ సర్కార్ చిత్తశుద్ధితో పని చేయాలని కేసీఆర్ కుమార్తే, ఎమ్మెల్సీ కవిత చురకలు అంటించిన సంగతి తెలిసిందే. గతంలో ఆమె ఢిల్లీ వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారని, బీఆర్ఎస్ టికెట్లలో మాత్రం మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మహిళా రిజర్వేషన్ అంశం మాటల తూటాల పేల్చివేతకు దారి తీసింది.
- Tags
- bandi sanjay
- bjp
- BRS
- kcr
- telugu news
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!