Etela Rajender: బీజేపీలోకి వెళతారనే భయంతో టికెట్ లు అనౌన్స్ చేశారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నర ఏళ్లలో అన్ని ఎన్నికల్లో ప్రజాస్వామిక పద్దతుల్లో బీజేపీ గెలిచిందని అన్నారు. డబ్బుతో బీఆర్ఎస్ ఒక్కటి రెండు చోట్ల గెలిచిందని అన్నారు. తెలంగాణ ప్రజలు స్పష్టంగా కేసీఆర్ ను ఎదుర్కొనే శక్తి బీజేపీకి వున్నట్లు నాలుగున్నర ఏళ్లలో బీజేపీ గెలిచిన ఎన్నికలే నిదర్శనమని తెలిపారు. నాలుగున్నర ఏళ్లలో ఒక్క ఎన్నికలో కూడా కాంగ్రెస్ గెలువలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు ప్రాధాన్యత ఇవడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ మళ్ళీ అధికారం లోకి రావద్దని అన్ని వర్గాలు తెలంగాణలో నిర్ణయం చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ బాధ్యతలను అమిత్ షా కి ఇచ్చారని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి మంచి పట్టు వుందని, నిరుపిస్తామన్నారు. 27న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమిత్ షా సభను జయప్రదం చేయాలని కోరారు.
ఖమ్మం జిల్లా ప్రధాని మోడీకి అండగా ఉంటుందని చూపించాలని కోరారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర కావాలని కోరితే రైతులకు బేడీలు వేసినది ఖమ్మం జిల్లా గిరిజనులను వ్యవసాయం నుంచి దూరం చేసే కుట్రలు జరిగాయని అన్నారు. గిరిజనుల మీద అనేక దౌర్జన్యాలు ఖమ్మం జిల్లాలో జరిగాయని తెలిపారు. చైతన్యానికి కూడా ఖమ్మం జిల్లా కేంద్రమని అన్నారు. మార్పుకు నాంది కూడా ఖమ్మం జిల్లానే అన్నారు. ధర్మానికి న్యాయానికి అండగా ఉంటారని నమ్మకమన్నారు. కేసీఆర్ కు పేదలు ధనికులు అనే తేడా వుండదని తెలిపారు. మోడీ మాత్రం పేద రైతుల పక్షపాతన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత స్ప్రింక్లర్ లు లేవు, డ్రిప్ ఇరిగేషన్, రోటవేటర్ లేదు, సబ్సిడీ లేదు, టర్పలిన్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఏ పథకం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమా పథకం కూడా లేదన్నారు. పంట నష్టం కూడా ఇవ్వడం లేదని తెలిపారు.
రైతు బందు ఇచ్చి అన్ని పథకాలు బంద్ చేసిన ప్రభుత్వం కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారం లోకి వచ్చిన ఏ స్కీం కూడా తీసి వేయమని స్పష్టం చేశారు. ఇంకా మంచి స్కీం లు ప్రవేశ పెడతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బు, దావత్ ల మీదే కేసీఆర్ కు నమ్మకముందని తెలిపారు. నియోజకవర్గాలకు ఇప్పటికే ,30,40 కోట్లు ఖర్చు పెట్టే గెలివాలని చూస్తున్నారని అన్నారు. కమ్యునిస్టు వారి కుటుంబంలో పుట్టిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫ్యూడల్ మనస్వత్వం వున్న వ్యక్తి అని మండిపడ్డారు. పోలీస్ లను నమ్ముకున్న వారికి పరాజయం తప్పదని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్ రాదని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ భయానికి గురైందని తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే లు బీజేపీలోకి వెళతారని భయంతో టికెట్ లు అనౌన్స్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీ నాయకులను కొనుగోళ్లు చేయడం కోసం ముందే అభ్యర్థులను ప్రకటించిందని ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Shamshabad: శంషాబాద్‌లో దుబాయ్ విమానం ఎమర్జెన్సీ లాండింగ్.. నలుగురు ప్రయాణికుల్ని దించేసిన పైలట్