Tummala Nageswara Rao: తుమ్మల నాగేశ్వరరావు భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరారు. ఖమ్మం వస్తున్న తమ నేతకు ఘనస్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాయకన్ గూడెంకు తరలివస్తున్నారు. 2 వేల కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఖమ్మంలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. తుమ్మల పాలేరు అసెంబ్లీ టికెట్ ఆశించిన.. కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ ప్రకటించారు. దీంతో అసంతృప్తితో ఉన్న తుమ్మల.. ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావులను శాంతింపజేసేందుకు హైదరాబాద్‌లోని తుమ్మల ఇంటికి పంపారు. ఇరువురు నేతలు తుమ్మలతో సమావేశమై చర్చించారు. అయితే తుమ్మల మాత్రం ఇంకా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Read also: Uttam Kumar: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగబోతోంది.. ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
పాలేరు నుంచి తమ నేతకే టికెట్ వస్తుందని భావించినట్లు నాగేశ్వరరావు బంధువులు చెబుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1983 ఎన్నికల్లో ఓడిపోయారు. 1985, 1994, 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలుపొందారు. విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీగా, మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అప్పటి నుంచి తుమ్మల పాలేరు నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో 2016లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట రెడ్డి మృతితో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో తుమ్మల పాలేరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి పోటీ చేసి బీఆర్‌ఎస్ తరఫున గెలుపొందారు. కానీ కేసీఆర్ తుమ్మలకు బదులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో తుమ్మల భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
Uttam Kumar: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగబోతోంది.. ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు