బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణపై దాడిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ నేత డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. బాన్సువాడ క్యాంపు కార్యాలయంలో నిద్రిస్తున్న యెండల లక్ష్మి నారాయణతో పాటు కార్యకర్తలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది బీఆర్ఎస్ గుండాలపనే అని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో ఆయనపై జరిగిన దాడిపై తాజాగా కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యాలయాన్ని విధ్వంసం చేయడంతో పాటుగా లక్ష్మీనారాయణ గారి డ్రైవర్‌పై భౌతికదాడులకు…
2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది.. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు.. పోలవరం ప్రాజెక్టు అతి గతి లేని పరిస్థితి అయిందని ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
Case Filed on BRS Candidate Padi Koushik Reddy: హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు రోజైన మంగళవారం కౌశిక్ రెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై కమలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కమలాపూర్ ఎంపీడీవో ఫిర్యాదు మేరకు.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: Rahul Dravid-BCCI: నెహ్రా వద్దన్నాడు.. రాహుల్‌కు బీసీసీఐ మరో…
EC order for investigation on Padi Koushik Reddy Comments: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన మంగళవారం హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. మీరు గెలిపిస్తే విజయయాత్ర.. లేకపోతే కుటుంబంతో సహా శవయాత్ర అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి.. నివేదిక అందించాలని హుజూరాబాద్ ఎన్నికల…
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ముఖ్యమంత్రి చేసి నా గౌరవాన్ని పెంచింది గజ్వేల్ గడ్డ అని తెలిపారు. గజ్వేల్ కి రైలు వస్తుందని అనుకోలేదు కానీ రైలు వచ్చింది.. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. ఇతర దేశాల ప్రతినిధులు గజ్వేల్ కి వచ్చి మన అభివృద్దిని చూసి వెళ్తున్నారని తెలిపారు. అయ్యింది చాలా గొప్ప అంటే సరిపోదు..ఇంకా చాలా చేయాలన్నారు.…
తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాల పోరాటం, నీళ్లు - నిధులు - నియామకాల కోసం ఆరాటం, లాఠీ దెబ్బలు, రబ్బరు బుల్లెట్ల గాయాలు, టియర్ గ్యాస్‌తో కళ్ల మంటలు.. ఇవి సరిపోవడం లేదని 1969లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పోలీసుల కాల్పుల్లో 369 మంది విద్యార్థుల బలిదానం, మలిదశ ఉద్యమంలో మనకళ్లముందే 1200 మంది ఆత్మబలిదానం, చిన్న నుంచి పెద్ద వరకు, సకల జనులంతా ఏకమై..…
Telangana Elections: రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రచారంలో పరిగెత్తుతున్న అభ్యర్థుల మైకులు మూగబోనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని ఓటర్లకు ప్రసన్నం చేసుకునేందుకు బయలు దేరారు.
CM KCR: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారంతో ముగియనుంది. ఓటింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
తన సొంత ఇలాకాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కొడంగల్ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది అని అన్నారు. 20 ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడానని తెలిపారు. ఈ కొడంగల్ గడ్డ... నా అడ్డా.. మీ బిడ్డ.. మీరు నాటిన మొక్క... రాష్ట్రానికి నాయకత్వం…
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏటూరునాగారం రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగులో వంద శాతం గెలుస్తామన్నారు. గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అభివృద్ది ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.