తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు మొత్తం రెడీ అయింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గానూ కాసేపట్లో ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది.
మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. "హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెట్ రెడీ సెలబ్రేటీ గాయ్స్" అని ట్వీట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ గెలుపుపై మరింత విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదయం కూడా ఒక ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ తమ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ముమ్మాటికీ 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుందని దాసోజు శ్రవణ్ అన్నారు. మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ ది పేగు బంధం అని పేర్కొ్న్నారు. ఎగ్జిట్ పోల్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు మధ్య చాలా తేడా ఉంటుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడని చెప్పారు. కాంగ్రెస్ నేతలు లేకి తనం చూపిస్తున్నారు.. చిల్లర…
రాత్రి 11 గంటల వరకు పోలింగ్ నడిచిందని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోలింగ్ నడుస్తున్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల కమీషన్ ఎలా అనుమతించారు..? అని ప్రశ్నించారు. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత 30 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్ ఎలా సరైందని విమర్శించారు. నూటికి నూరు శాతం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు.. సత్తుపల్లిలో నాల్గోసారి విజయం సాధిస్తున్నట్లు ధీమా…
Durgam Chinnaiah: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలింగ్ ముగిసిన అనంతరం.. గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత ద్వేషం ఉందో గజ్వేల్ లో తిరిగితే అర్థం అవుతుందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేది వేరు చేసేది వేరు.. నియంత లాగా వ్యవహారం చేశారని తెలిపారు. కేసీఆర్ ని ఓడించడానికి బలమైన నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడ జనం ఓటు వేశారని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలకు జరగగా.. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.
Congress vs BRS at Tandur: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు సజావుగానే సాగుతున్నా కొన్నిచోట్ల మాత్రం చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో సాయి పూర్ లోని పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాలా సేపు పోలింగ్ కేంద్రంలో రోహిత్ రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ నాయకుల నినాదాలు మొదలు…