Telangana Assembly Election 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది.. అయితే, కాంగ్రెస్ వేవ్‌లోనూ దాదాపు 40 స్థానాలను అధికార బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం కల్పించడమే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమే ప్రచారం ఉంది.. ఇదే సమయంలో.. చివరి నిమిషంలో అభ్యర్థులను మారుస్తూ స్కెచ్ వేసిన కేసీఆర్.. అక్కడ మాత్రం ఆ అభ్యర్థులను గెలిపించుకున్నారు.. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలినా.. బీఆర్‌ఎస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం కలిసి వచ్చాయి.. కలిసి వచ్చాయి. లేకపోతే మరికొన్ని స్థానాలను కూడా బీఆర్ఎస్ వదులుకోవాల్సిన పరిస్థితి ఉండేది..
Read Also: Anasuya: కేటీఆర్ సర్.. మీరు నిజమైన నాయకుడు.. అనసూయ ట్వీట్
ఇంతకి కేసీఆర్.. పార్టీ అభ్యర్థులను మార్చి విజయం సాధించిన స్థానాలు ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. అలంపూర్ నియోజకవర్గంలో అబ్రహం స్థానంలో విజయుడికి సీటు ఇచ్చి గెలిపించుకున్నారు.
జనగాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై తీవ్ర వ్యతిరేక ఉందని గుర్తించిన గులాబీ పార్టీ బాస్.. ఆ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీటు ఇచ్చి విజయం సాధించేలా చేశారు. స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పలు వివాదాల్లో చిక్కుకోవడంతో.. ఆ స్థానంలో కడియం శ్రీహరిని బరిలోకి దింపి గెలిపించుకున్నారు.. ఇక, నర్సాపూర్‌లో మదన్ రెడ్డి స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి చివరి నిమిషంలో బీఫామ్ ఇవ్వడంతో ఆమె కూడా గెలుపొందారు. కోరుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కుమారుడు కల్వకుంట్ల సంజయ్ రావును బరిలోకి దింపడంతో.. ఆయన అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నాడు.. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు స్థానంలో కోవాలక్ష్మీకి అవకాశం ఇచ్చి. విజయం సాధించేలా చేశారు. దుబ్బాకలో ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించిన కేసీఆర్.. కత్తిపోటుకు గురై బెడ్‌పై ఉండి కూడా తిరిగులేని మెజార్టీతో కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకున్నారు. బోథ్‌లో రాథోడ్ బాబురావు స్థానంలో అనిల్ జాదవ్‌కు అవకాశం.. ఇచ్చి విజయతీరాలకు చేర్చారు. ఉప్పల్‌లో బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చి గెలిపించారు. మరోవైపు.. మల్కాజ్‌గిరి స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావుకు కేటాయించినా.. ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో.. ఆ స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డిని బరిలోకి దింపి.. అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేశారు.. మొత్తంగా.. చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చిన స్థానాల్లో విక్టరీ కొట్టింది బీఆర్ఎస్.. దీని వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఎంత వ్యతిరేకతో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.