Bandi Sanjay Wants Re Counting in Karimnagar: కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై హైడ్రామా కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై 326 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న బండి సంజయ్.. రీకౌంటింగ్ కోరారు. దాంతో అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
కౌంటింగ్‌లో ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న గంగుల కమలాకర్.. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అయితే మూడు వేల తేడాతో విజయం సాధించామని గంగుల వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితంపై కరీంనగర్ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ బరిలో దిగారు. బీఆర్‌ఎస్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ పోటీ చేయగా.. కాంగ్రెస్ తరఫున పురుమల్ల శ్రీనివాస్ బరిలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ బండి సంజయ్, గంగుల కమలాకర్ మధ్యే ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ అంచనాలే ఇప్పుడు నిజమయ్యాయి. కేవలం 300 ఓట్లు అంటే హోరాహోరిగా ఎక్కడ ఎన్నికలు జరిగాయి.