Minister KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో ఒక్క రోజు సమయం ఉంది. దీంతో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ పార్టీ ఇంకాస్త ముందంజలో ఉంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10.25 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు హకీంపేట్కు ఆయన చేరుకోనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నేడు భువనగిరి, గద్వాల్, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడ నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధులకు మద్దతుగా ఆమె ప్రచారం చేయబోతున్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్ధతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. తనకు మద్దతుగా తెలిపేందుకు విచ్చేసిన యోగి ఆదిత్యానాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా.. కుత్బుల్లాపూర్ గడ్డమీద అడుగుపెట్టినందుకు వారికి శిరస్సు వంచి స్వాగతం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు చీల్చి బీఆర్ఎస్ ను గెలిపించేలా బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని అర్థమవుతోందని ఆరోపించారు.
Revanth Reddy: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోజున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర ఆక్రమించిన భూములు ఉండొచ్చు, అక్రమ సంపాదన ఉండొచ్చు కానీ ప్రజా మద్దతు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్కి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లలో పటాన్చెరులో బీఆర్ఎస్ నేతల రౌడీయిజం, వాళ్ల ఆగడాలు మీకు తెలుసని, మీరు ఓటేసి గెలిపిస్తే మీ భూముల్ని గుంజుకున్నరు,…
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మంత్రి కేటీఆర్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2009లో గెలిస్తే తెలంగాణ తెస్తా అని మీకు హామీ ఇచ్చినా.. కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది, అందులో అందరి కష్టం ఉందని అన్నారు. సిరిసిల్లను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినా.. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని…
CM KCR: ముఖ్యమంత్రిగా ఈ స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పెట్టిన భిక్ష అని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధన కోసం పుట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం దుబ్బాకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దుబ్బాకలోనే తాను చదువుకున్నట్లు చెప్పారు. ఉన్న తెలంగాణను ఊగగొట్టంది కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. 2001లో గులాబీ జెండా ఎగిరితే, 2004లో కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తు పెట్టుకుందని చెప్పారు.
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అక్కడ నిర్వహించిన రోడ్డు షోలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ బొమ్మ బొరుసు లాంటివని విమర్శించారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ గెలుపు కొరకు పనిచేస్తుందని చెప్పారు. కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని లూటీ చేశాడని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరి పై 94 వేల రూపాయల అప్పు…