తెలంగాణలో ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగించింది. దాదాపు కాంగ్రెస్ విజయం ఖరారైపోయింది. ఈ క్రమంలో హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కు అవకాశమిచ్చిన ప్రజలు.. ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్ధతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు.’ తెలిపారు.