Kavitha Kalvakuntla Tweet on BRS Defeat: అధికారం ఉన్నా లేకున్నా.. తాము తెలంగాణ ప్రజల సేవకులమే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు మరియు కాంగ్రెస్ పార్టీకి ఆమె అభినందనలు తెలిపారు. దేవుడు తెలంగాణను ఆశీర్వదిస్తాడని కవిత పేర్కొన్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికి 25 స్థానాలు మాత్రమే గెలిచిన బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టలేకపోయింది.
కల్వకుంట్ల కవిత తెలంగాణ ఎన్నికలపై ట్వీట్ చేశారు. ‘జై కేసీఆర్.. జై బీఆర్‌ఎస్. ప్రియమైన బీఆర్‌ఎస్ కుటుంబానికి, కృషికి ధన్యవాదాలు. మీరు చేసిన పోరాటానికి సోషల్ మీడియా యోధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనం మరచిపోవద్దు.. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమే. మనమందరం మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దాం. కోరుట్ల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. గెలిచిన ఎమ్మెల్యేలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. దేవుడు తెలంగాణను ఆశీర్వదిస్తాడు’ అని కవిత ట్వీట్ చేశారు.
Jai KCR !! Jai BRS !!
Dear BRS family, thank you for all the hardwork !!
Special thanks to all the social media warriors for the fight you put up !!
Let us not forget.. with or without power we are servants of Telangana People. Let us all spiritedly work for our MotherLand.…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 3, 2023