Telangan Women MLAs: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహారాణులు వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangan Women MLAs: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీని 40 స్థానాల్లోపే పరిమిత చేసిన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 64 స్థానాలను గెలిచిన కాంగ్రెస్.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మహిళలు పోటీ చేయగా.. చాలా నియోజకవర్గాల్లో మహిళలకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహారాణులెవరో తెలుసుకుందాం..
సబితా ఇంద్రారెడ్డి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ పై ఆమె గెలుపొందారు.
Also Read
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
సునీతా లక్ష్మారెడ్డి: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై సునీత ఘన విజయం సాధించారు.
దనసరి అనసూయ (సీతక్క): ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఈ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై సుమారు 28వేల ఓట్ల భారీ మెజారిటీకో విజయం సాధించారు. ములుగులో సీతక్క గెలవడం ఇది మూడోసారి. ఈ విజయంతో సీతక్క హ్యాట్రిక్ విజయం సాధించినట్లయింది.
Read Also: Jaggareddy: ప్రజలు నాకు 5 ఏళ్లు విశ్రాంతి ఇచ్చారు.. ప్రజా తీర్పును స్వాగతిస్తున్నా..
కొండా సురేఖ: వరంగల్ తూర్పులో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌పై ఆమె గెలుపొందారు.
ఉత్తమ్ పద్మావతి: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోదాడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌పై ఆమె గెలిచారు. 2018 ఎన్నికల్లో బొల్లం మల్లయ్య చేతిలో పరాజయం పాలైన ఆమె.. తిరిగి 2023 ఎన్నికల్లో అదే అభ్యర్థిపై విజయం సాధించడం గమనార్హం.
లాస్య నందిత: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని లాస్య నందిత విజయం సాధించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి శ్రీ గణేశ్ రెండో స్థానంలో ఉండగా, వెన్నెల మూడో స్థానానికి పరిమితం అయ్యారు. లాస్య నందిత 17వేల 169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
కోవాలక్ష్మీ: ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ఆత్మారామ్ నాయక్‌పై ఆమె గెలుపొందారు.
చిట్టెం పర్ణికా రెడ్డి: నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణికా రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్ రెడ్డిపై 7వేల 950 ఓట్ల ఆధిక్యతో ఆమె గెలుపొందారు.
మామిడాల యశస్విని రెడ్డి: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన పిన్నవయస్కురాలిగా నిలిచారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆమె ఓడించారు.
మట్టా రాగమయి: సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్టా రాగమయి గెలుపొందారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!