Big Shock: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్కు షాక్లు మీద షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో.. నల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read Also: TS News: రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు..
ఈ కౌన్సిలర్లు ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీని వీడారు. తాజాగా కాంగ్రెస్ లోకి మరి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో నల్లగొండ మున్సిపాలిటీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. త్వరలో మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Guvvala Balaraju: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్.. కార్యకర్తల ఆందోళన