Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా కేశవాపురం గ్రామంలో భూకబ్జా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్కు షాక్లు మీద షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో.. నల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Ponguleti: ఖజానాను ఖాళీ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఇచ్చింది.. అయినా ఆరు గారింటీలను ఇస్తామని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రజలు మమ్ములను ప్రశ్నలు అడిగారు.. ప్రత్యర్థులు పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయని తెలిపారు. వారి విమర్శలను తిప్పికొట్టడంలో నిర్లిప్తత చేయడంతో నష్టం చేకూరిందని అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో అప్పజెప్పాం అనే దానిపై బండి…
Sridhar Babu: సిద్దిపేటలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. అనంతరం అక్కడి నుంచి మంథనికి చేరుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్కు వెళ్లిన శ్రీధర్బాబు ప్రమాణస్వీకారం చేసి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం
Telangana High Court: సింగరేణి ఎన్నికల్లో మరో పెద్ద ట్విస్ట్. ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కార్మిక సంఘాల మధ్య పోరు తారాస్థాయికి చేరడమే ఇందుకు కారణం.
అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. అసెంబ్లీ ముందు ఉన్న ముళ్ల కంచెలు తొలగించే విషయమై అన్ని పార్టీలతో సమావేశం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆ అంశాలు.. అసెంబ్లీ, మండలి వ్యవహారాలు చైర్మన్, స్పీకర్ పరిధిలో ఉంటాయి.. మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్…
అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయి ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేనిపక్షంలో వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని చెప్పారు. కేసీఆర్ హయాంలో పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంఓలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ కేసీఆర్ కుటుంబానికి…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. ఈ క్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మాటలు కోటలు దాటుతున్నాయి.. ఇప్పుడే గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగితే మైక్ ఇవ్వలేదన్నారు. సీఎం స్లీపింగ్ రిమార్కు చేశారు.. సీఎం మాదిరిగా స్లీపింగ్ రిమార్కు చేయనన్నారు. ఇంకా రేవంత్ సీఎం అయినట్టు భావించడం లేదు.. ఇంకా పీసీసీ చీఫ్ అనుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమాల నుండి వచ్చిన పార్టీ అని చెప్పుకుంటారు.. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు తొమ్మిదిన్నర ఏండ్లలో ప్రగతి భవన్ పిలిచారా అని ప్రశ్నించారు. వాళ్ళ త్యాగం గుర్తించారా అని అన్నారు. కేసీఆర్.. అమరుల కుటుంబంకి బుక్కెడు బువ్వ పెట్టారా అని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబంలో అందరికి మంత్రి పదవులు ఇచ్చారు.. పేగు బంధం ఉన్నవాళ్లకు పదవులు ఇచ్చారు.. కానీ ఆత్మహత్య చేసుకున్న…