తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. ఈ క్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మాటలు కోటలు దాటుతున్నాయి.. ఇప్పుడే గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగితే మైక్ ఇవ్వలేదన్నారు. సీఎం స్లీపింగ్ రిమార్కు చేశారు.. సీఎం మాదిరిగా స్లీపింగ్ రిమార్కు చేయనన్నారు. ఇంకా రేవంత్ సీఎం అయినట్టు భావించడం లేదు.. ఇంకా పీసీసీ చీఫ్ అనుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.
Ambati Rambabu: చంద్రబాబు, లోకేష్‌లు సింగిల్‌గా పోటీ చేయగలరా?.. అంబటి సవాల్
ప్రతిపక్ష నాయకుడిగా మట్లాడుతున్నాను.. సభను తప్పుదోవ పట్టించారని హరీష్ రావు తెలిపారు. కుటుంబ పాలన గురించి మట్లాడుతున్నారు.. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వెతికినట్టు ఉందని హరీష్ రావు విమర్శించారు. రాజీవ్ గాంధీ చనిపోతే ఇటలీ నుండి సోనియాగాంధీని తెచ్చుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో.. భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాజకీయ విమర్శలు చేయడం సరికాదు.. క్లారిఫికేషన్ అడగండి అని అన్నారు.
Man kills Mother: రూ. 5000 ఇవ్వలేదని అమ్మను చంపాడు.. సూట్‌కేస్‌లో డెడ్‌బాడీతో వేరే రాష్ట్రానికి..
హరీష్ రావు మాట్లాడుతూ.. మా గొంతు ఎందుకు నొక్కుతున్నారు.. గుమ్మడి కాయ దొంగలు అంటే.. భుజాలు తడుముకుంటున్నారు ఎందుకని ప్రశ్నించారు. పీవీ చనిపోతే చూడటానికి వెళ్ళని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. వెంటనే మళ్లీ హరీష్ రావు మైక్ కట్ చేశారు. మళ్లీ హోంమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. క్లారిఫి కేషన్ అడగండని స్పీకర్ కు చెప్పారు. మైక్ ఇస్తే ఇలాంటి ఆరోపణలు చేస్తారా అని భట్టి అన్నారు. మళ్లీ హరీష్ రావు మాట్లాడుతూ.. 15 నిమిషాలు సమయం ఇవ్వండి అని అన్నారు. పీవీని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అనగానే.. మంత్రి భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. హరీష్ రావు మైక్ కట్ చేశారు.. అనతంరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 2019లో సభలో మాకు ఒకరికి అవకాశం ఇచ్చారు.. ప్రతిపక్ష పార్టీలకు ఒక్కరికే సమయం ఇచ్చారు.. హరీష్ సీనియర్.. ఇలా తప్పు పట్టొద్దని అన్నారు.