Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ శాసనసభ తిరిగి ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంపై అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఇరుపక్షాల నేతలు మాటల యుద్ధానికి దిగారు. చాలా సేపటి తర్వాత సమావేశంలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. అయితే ఈ సమావేశాలు శనివారంతో ముగియగా.. మూడు రోజుల తర్వాత మళ్లీ ఇవాళ ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ఆర్థిక స్థితిగతులు, నీటిపారుదల, విద్యుత్ రంగాలపై చర్చలు జరగనున్నాయి. ఈ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు నిన్న (మంగళవారం) ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇందులో గత ప్రభుత్వం ఇచ్చిన రుణాలు, అమలు చేసిన విధానాలకు అధికార కాంగ్రెస్ బ్రేక్ వేసే అవకాశం ఉంది.
Read also: Gandhi Hospital: కోవిడ్ కొత్త వేరియంట్ వార్తలన్నీ ఫేక్.. గాంధీలో కేసులేమీ నమోదు కాలేదు..
అయితే దీన్ని తిప్పికొట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా సిద్ధమైంది. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయాలని భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఇతర ముఖ్య నేతలు భేటీ అయ్యారు. వీరంతా బుధవారం జరిగే సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవసరమైన అంశాలపై చర్చించినట్లు సమాచారం. తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం స్పీకర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అయితే దీనిపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ పీపీటీకి స్పీకర్ అనుమతి ఇస్తే సభలో మళ్లీ వాడివేడి వాతావరణం, మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది.
Viral Video: తుఫాన్ గాలికి కొట్టుకుపోతున్న విమానం..