తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. విద్యుత్ పై స్వల్పకాలిక చర్చపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం పర్మినెంట్ అనుకున్నారు.. ప్రజలు ఇచ్చిన షాక్ తో తిమ్మతిరిగింది..ఇంకా బయటకు రాలేక పోతున్నారని విమర్శించారు. అహంకార మాటలు చూసి బుద్ది రావాలని ప్రజలు బీఆర్ఎస్ నేతలను పక్కన పెట్టారని ఆరోపించారు. అయినా బుద్దిరాలేదని అన్నారు. పార్టీ మార్పులపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్ని పార్టీలు మారారు.. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ మారలేదా అని ప్రశ్నించారు. నేను ఏ పార్టీలో ఉన్నా.. కేసీఆర్ పాలన పోవాలని కొట్లాడనన్నారు.
Read Also: TS Assembly: కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి.. సభలో కరెంట్ మంటలు
పార్టీ మారింది ప్రజల కోసం.. పదవుల కోసం జి హుజుర్ గా పని చేయలేదని జగదీష్ రెడ్డిపై రాజగోపాల్ విరుచుకుపడ్డారు. సీఎం నిర్ణయం ఏదైనా నిర్ణయం తప్పు తీసుకుంటే మేము సరిచెప్పే ధైర్యం మాకు ఉంది.. మీకు ఉందా.. కేసీఆర్ కి చెప్పే అంత ఉందా అని ప్రశ్నించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు మట్లాడుతున్నారు.. మీ లాగా కాంగ్రెస్ లో గెలిచిన 12 మందిని తీసుకుని ప్రజాస్వామ్యం కుని చేయలేదని మండిపడ్డారు. రాజీనామా చేసి పార్టీ మారాను.. ఖబడ్దార్.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగ్రత్తగా ఉండండి.. కమిషన్, కాంట్రాక్టుల కోసం అప్పులు చేశారు.. అభివృద్ధి కోసం చేయలేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ పై విచారణకు సీఎం ఆదేశించారు.. భయంకరమైన పరిస్థితిలో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కిరసనాయిల్ దీపం, కిరాయి ఇంట్లో ఉన్నా అని చెప్పిన జగదీష్.. వెయ్యి కోట్లు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు. భూములు, ఇసుక మాఫియా చేసిన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు.
Read Also: Dunki : డంకీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?