తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఇవాళ హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. సీబీఐతో విచారణకు గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
Off The Record: అచ్చంపేట బీఆర్ఎస్లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయం నడుస్తోంది. తమ రాజకీయ ప్రయాణానికి అడుగడుగునా స్పీడ్ బ్రేకర్‌గా మారిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టార్గెట్‌గా ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ… వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. దీంతో అచ్చంపేట గులాబీ పార్టీ రెండు వర్గాలుగా చీలినట్లు కనిపిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ పీఠం… అచ్చంపేట నియోజకవర్గ…
కొంత కాలంగా గవర్నర్, తెలంగాణ సర్కార్ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈ దూరం కారణంగా బడ్జెట్ ఆమోదించలేదని హైకోర్టు తలుపు తట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పరిణామాల్లో వచ్చిన మార్పుతో గవర్నర్, రాష్ట్ర సర్కార్ మధ్య సయోధ్య కుదిరింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై తీరుపై అధికార BRS పార్టీ నాయకులు కొంతకాలంగా భగ్గుమంటున్నారు. రాజ్‌భవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సీన్ మారడంతో గవర్నర్ విషయంలో అధికారపార్టీ నేతల…
ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సమక్షంలో ఒడిశా మాజీ సీఎం, ఆరాష్ట్ర సీనియర్ నేత, గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి సీఎం పుష్పాంజలి ఘటించారు.
Minister Errabelli : దేవుళ్ల పేరుతో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాజకీయం చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పర్యటించారు.
Byreddy Siddarth Reddy: వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏంచేస్తుందో చూద్దాం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లో జగన్ ప్రవేశిస్తే అక్కడ ప్రకంపనలు వస్తాయన్నారు. జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన కోసం స్పందించే కోట్లాది హృదయాలు ఉన్నాయని బైరెడ్డి అన్నారు. ఆ దృష్టితోనే తాను జగన్‌కు ప్రైవేటు సైన్యం ఉందని వ్యాఖ్యానించానని.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ జగన్ అభిమానులు ఉన్నారని తెలిపారు.…