K.A.Paul: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత 48 గంటల్లో అరెస్ట్ కాబోతోందని జోస్యం చెప్పారు. మార్చి 10న కవితను అరెస్ట్ అవుతుందని అన్నారు. కేసీఆర్ పతనానికి ఇది నాంది మాత్రమేనన్నారు. ఎందుకంటే తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల కన్నీళ్లు అని చాలా మంది కేసీఆర్ కుటుంబానికి తగిలిందని విమర్శించారు. కేసీఆర్ దేవుడిని శత్రువుగా చేసుకున్నారని అన్నారు. నేను చెప్పేది నిజంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన షోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. పాల్ కంగారుగా వచ్చి మాట్లాడారో ఏమో తెలియదు కానీ.. పాపం పైన డ్రస్ వేసుకుని కింద ప్యాంట్ మర్చిపోయి డిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. ఆత్రుతగా వచ్చి అన్ని వివరించిన పాల్‌కు వీడియె చూస్తూ కిందికి చూడగానే దిమ్మతిరగేలా అయ్యింది. పైన డ్రస్ అయితే వేసుకున్నారు గానీ.. కింద్ర మాత్రం ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారు పాల్. ఇది ఒక ఫ్యాషన్ ఏమో అని కొందరు అంటుంటే.. అమ్మాయిలయితే బాగుంటుంది. అబ్బాయిలతే ఫ్యాషన్ ఏంటి పిచ్చి కాకపోతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అంతగా ప్యాంట్ మర్చిపోయి వచ్చి ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందో.. ఏదైమైనా పాల్ మాత్రం ప్యాంట్ అయితే మర్చిపోయారు గానీ.. కవిత మాత్రం 10న అరెస్ట్ అవుతుందని జోస్యం చెప్పడం సంచలనంగా మారింది.
Read also: Bandi Sanjay: బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు సంబంధమే లేదు
ఇది ఇలా ఉంటే.. ఈడీ కి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేనని 15న హాజరవుతానని లేఖ లో పేర్కొన్నారు. 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని. ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయ్యాయని ఈడీకి వివరించారు. ఈడీ స్పందన ఎలా ఉండనుంది.. ఏం చెప్పనుంచి పర్మిషన్ ఇస్తుందా? లేదా? అనే విషయంపై ఉత్కంఠత నెలకొంది. ఈనేపథ్యంలో.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్ళే దారులు అన్ని మూసివేశారు అధికారులు. కవిత ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోనికి వెళ్లేందుకు ఎవరినీ అనుమతి ఇవ్వడం లేదు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీకెడ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు.
RTC Chairman Bajireddy: ఇదొక డ్రామా.. ఈడీ నోటీసులపై బాజిరెడ్డి స్పందన..