Harish Rao: కూల్చుతామంటున్న బీజేపీ కావాలా.. నిలబెట్టే కేసీఆర్ కావాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Comments On BJP and Congress Party: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మార్కెట్ యార్డ్‌లో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ నాలుగేళ్ల పాలనలో ఒక్క రూపాయి పని చేయలేదని విమర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు మిగులు పనుల్లో 10 కిలోమీటర్ల పనికిగాను 9 కిలోమీటర్ల 700 మీటర్ల పని పూర్తయింది, మిగిలిన 300 మీటర్ల పనిని 45 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పండుగ వాతావరణంలో గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామని అన్నారు. హుస్నాబాద్ గడ్డమీద పుట్టిన వాళ్ళు, గౌరవెల్లి ప్రాజెక్టు పనులను అడ్డుకోరని పిలుపునిచ్చారు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం అంటే చింత అని, కానీ నేడు సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం అంటే నిశ్చింత అని వెల్లడించారు.
Telugu Movies: అంతర్జాతీయ వేదికపై మన తెలుగు సినిమాలు!
Also Read
- Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
- Cab Driver Rajasekhar : క్యాబ్ కోసం పక్కా స్కెచ్.. డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.!
- DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
- KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం ఉంటే, తెలంగాణలో రెట్టింపు వృద్ధిరేటు 8 శాతం వుందని హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా రైతుబంధు ఇచ్చే రైతుల సంఖ్య రెట్టింపు చేసి ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చే 6000 రూపాయలకు రైతుల సంఖ్యను తగ్గించి ఇస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతీ రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు పెంచుతా, కూల్చుత అంటూ.. తెలంగాణ ప్రభుత్వంపై నిందలు, అనుమానాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిందలు వేస్తూ కూల్చుతామంటున్న కాంగ్రెస్, బీజేపీలు కావాలో.. నిలబెట్టే కేసీఆర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పారు. వచ్చే ఉగాదిన గర్భిణుల కోసం న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలో ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!