BRS vs Speaker: తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పూర్తి చేయలేదంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున ఈ పిటిషన్ దాఖలు అయింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ వేశారు. ‘కారు’ గుర్తు ఉన్న పార్టీ (బీఆర్ఎస్) వాళ్ల పరిస్థితిని వాళ్లే చూసుకోవాలని విమర్శించారు. వాళ్ల కారు ఇప్పటికే రిపేర్ చేయడానికి కూడా పనికి రాకుండా షెడ్డులో పడిందని ఎద్దేవా చేశారు. కనీసం సెకండ్ హ్యాండ్లో కూడా కారును కొనడానికి ఎవరూ లేరని బండి విమర్శలు చేశారు. ఈ మేరకు బండి సంజయ్ తన ఎక్స్‌లో పోస్ట్…
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం నేడు చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ముగిసింది. ఈ సమయంలో, నలుగురు ఎమ్మెల్యేలపై క్రాస్ ఎగ్జామినేషన్ జరగగా, తదుపరి దశలో అక్టోబర్ 1న పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల అడ్వకేట్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామైన్ చేయనున్నారు.
శాసనసభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీల కోసం గతంలో కేసీఆర్ అనేక పోరాటాలు చేశారు.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి.. తిరిగి తెలంగాణలోనే అడుగు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే.. బీసీ బిల్లు సాధించుడో.. లేకపోతే ఢీల్లీ నుంచి తెలంగాణకు రాను అని అక్కడే జంతర్ మంతర్ లో కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి అని తెలిపారు. ప్రధానమంత్రి…
Guvvala Balaraju : భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి పెద్ద షాక్‌గా మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డా. గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. సోమవారం తన పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. Windows in shopping Mall: షాపింగ్ మాల్స్ లో కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా?..…
Jagadish Reddy : బీఆర్ఎస్లో నెలకొన్న విభేదాలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆయన, ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు సమాధానమిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. “నా ఉద్యమ ప్రస్థానంపై ఉన్న జ్ఞానానికి కవితకు జోహార్లు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆయన, “కేసీఆర్‌కు బద్ధ శత్రువులైన రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ ఏమి మాట్లాడుతున్నారో అదే పదాలను కవిత వాడుతున్నారు” అని విమర్శించారు. “వాళ్లు ఉపయోగించిన పదాలను కవిత వల్లెవేస్తున్నారు” అంటూ…
BRS : ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లతో కలిసి కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన నివేదిక, రాబోయే స్థానిక ఎన్నికల వ్యూహాలపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవలి కాలంలో ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ తరచుగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్తు…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి బీఆర్ఎస్లోని ఒక కీలక నేతనే కారణమని ఆమె ఆరోపించారు. జగదీష్‌రెడ్డి పేరు ప్రస్తావించకుండానే BRS లిల్లీపుట్ అంటూ కవిత ఫైర్ అయ్యారు. నల్గొండలో బీఆర్ఎస్ను నాశనం చేసిన లిల్లీపుట్ అన్న కవిత.. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఒక్కడే గెలిచాడు అని వ్యాఖ్యానించారు. తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖను బహిర్గతం చేయడం…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు (జూలై 27, 2025) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పర్యటన జరగనుంది. పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఈ పర్యటన జరుగుతుండటంతో, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో కేటీఆర్ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం, విగ్రహ ఆవిష్కరణ, మరియు కార్యకర్తల సమావేశాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు, కేటీఆర్ లలిత కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కుట్టు…