Kalvakuntla Kavitha Responds On BRS Party Contest In Maharashtra Elections: మహారాష్ట్ర అభివృద్ధిలో తమ బీఆర్ఎస్ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని, ఇక్కడి ప్రజల కోసం తాము పని చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ముంబయిలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన ఆమె.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా.. పొరుగున ఉన్న మహారాష్ట్రలో తెలంగాణ అభివృద్ధిపై ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయన్నారు. తెలంగాణతో 1000 కిలోమీటర్ల మేర మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటుందని.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తమ బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో విస్తరించి.. తెలంగాణలో చేస్తున్న పనుల్ని ఆ రాష్ట్రంలో చేయాల్సిందిగా అక్కడి ప్రజల నుంచి తమకు కొన్ని సంవత్సరాలుగా విజ్ఞప్తులు అందుతున్నాయన్నారు.
Amit Shah: ప్రధాని పదవి కోసమే నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు.
దేశంలో ఇప్పటివరకు విద్యుత్తు, తాగునీరు, సాగునీరు అందించడం వంటి కనీస సదుపాయాలను ఎవరు కల్పించలేదని.. తెలంగాణలో మాత్రం 98 శాతం సదుపాయాల కల్పనను పూర్తి చేశామని కవిత పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రమే ఇంత సాధించినప్పుడు.. దేశవ్యాప్తంగా ఎందుకు చేయలేరని ప్రశ్నించారు. ఈ ఎజెండానే ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీ విషయంపై పార్టీ ప్రకటన చేస్తుందని చెప్పిన ఆమె.. ఆ రాష్ట్ర ప్రగతిశీల అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుందని స్పష్టం చేశారు. శివాజీ, అంబేద్కర్‌తో పాటు అనేక మంది మహానుభావుల స్ఫూర్తితో.. తాము ప్రజల కోసం పని చేస్తామని తెలిపారు. ముంబయి పట్టణంలో రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే మంచినీరు సరఫరా అవుతుందని, హైదరాబాదులో మాత్రం 24 గంటల పాటు నల్ల ద్వారా ఇంటింటికి మంచినీరు అందుతుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు చేయలేరని నిలదీశారు. శరత్ పవర్‌తో కెసిఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఉద్యమానికి కూడా ఆయన ఎంతగానో తోడ్పడ్డారని తెలిపారు.
Dirty Fake Baba: దొంగ బాబా లైంగిక వేధింపులు.. స్త్రీలే లక్ష్యంగా దుర్మార్గపు దందా!