ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఈ సంక్రాంతి సంబరాల్లో మునిగితేలడమే కాకుండా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి సంబరాలను రెట్టింపు చేస్తూ ఏపీ ప్రజలకు తమ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ప్లెక్సీలు వెలిశాయి.
Off The Record: టీఆర్ఎస్ పార్టీ BRSగా మారిన తర్వాత ఖమ్మంలో మొదటి బహిరంగ సభ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకుంటున్న సీఎం కేసీఅర్..TRSను భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణతోనే అది సాధ్యమని గులాబీ దళపతి భావిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి BRSకు జాతీయ పార్టీగా గుర్తింపు కోసం గట్టి ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నారట. జాతీయ పార్టీ గుర్తింపు నిబంధనలను వీలైనంత తొందరగా…
Minister Srinivas Goud: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి వచ్చాను.. దర్శనం బాగా జరిగిందన్న ఆయన.. రాష్ట్ర విభజన ముందు కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గొడవలు లేకుండా ఉన్నారు.. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లపై దాడులు జరుగుతాయి అన్నారు.. జరిగాయా? అని ప్రశ్నించారు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి, సంతోషంగా ఉండాలని కోరుకుంటానన్న ఆయన..…
Off The Record: తెలంగాణలో గులాబీపార్టీ నేతల చూపంతా ప్రస్తుతం 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభపైనే ఉంది. టీఆర్ఎస్– బీఆర్ఎస్గా మారిన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. మంత్రులు హరీష్రావు, ప్రశాంత్రెడ్డితోపాటు మరికొందరు సభా ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. దాదాపు ఐదు లక్షల మందిని సమీకరించాలనేది పార్టీ లక్ష్యం. అప్పుడే బీఆర్ఎస్ సభ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని గులాబీ నేతల ఆలోచన. నియోజకవర్గాల వారీగా జనసమీకరణకు ప్రణాళికలు…
Off The Record: టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత మొదటిసారి బహిరంగ సభకు రెడీ అవుతోంది. మొదట్లో దేశ రాజధాని డిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు. అయితే తొలిసభ తెలంగాణలోనే అట్టహాసంగా నిర్వహించి ప్రయాణం మొదలుపెట్టాలని డిసైడైంది. ఈ నెల 18న ఖమ్మంలో 5 లక్షల మందితో సభ పెట్టి దేశం దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నారు గులాబీ నేతలు. తెలంగాణలోపాటు ఏపీ సరిహద్దు నియెజకవర్గాల్లోని ప్రజలను సభకు సమీకరించాలనేది పార్టీ నిర్ణయం.…
రాబోయే రాజకీయ చందరంగం కురుక్షేత్రంలో యుద్దానికి సిద్దంగా ఉన్నానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవంతుడి దయతో నా మీద ఉన్న మీ ప్రేమ వట్టిగా పోదు ప్రజలు ఏం కురుకుంటున్నారో రాబోయే కురుక్షేత్రంలో నెరవేరుస్తాను అని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ కామెంట్లు ప్రాధన్యత సంతరించుకుంది.
అధికారపార్టీ బీఆర్ఎస్కు కొత్త తలనొప్పి వచ్చిపడిందా? ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీల పంచాయితీ ఉండగానే.. కొత్తగా మరో రగడ మొదలైందా? కొంతమంది జడ్పీ చైర్మన్ల తీరు చర్చగా మారిందా? జిల్లాల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్టానం ఏం చేయబోతుంది? జడ్పీ ఛైర్మన్లు వర్సెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన వారితోపాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని పదవులు కట్టబెడుతూ వస్తోంది బీఆర్ఎస్. ఎమ్మెల్సీ, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, జిల్లా స్థాయిలో పదవుల్లో…
Harish Rao: కేంద్ర ప్రభుత్వ రంగాల్లో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అమ్మడం దారుణమన్నారు.