Minister KTR: మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం.. కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Condemns Manish Sisodia Arrest: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్‌ను తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం అని.. ప్రతిపక్షాలపై బిజెపి పార్టీ వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి, దొంగచాటు రాజకీయాలను బీజేపీ చేస్తోందని ఆరోపించారు. ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో.. అక్కడి పార్టీలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకొని బలహీనపరిచే కుట్రలో భాగమే ఈ సిసోడియా అరెస్ట్ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్రలు.. దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి కక్ష సాధింపు రాజకీయాలకు మనీష్ సిసోడియా అరెస్ట్ నిదర్శనమన్నారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ద్వారా చీవాట్లు తిన్న తర్వాత ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేకే సిసోడియాను ఇప్పుడు అరెస్ట్ చేశారని అన్నారు. బీజేపీ అసమర్థ విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న బలమైన పార్టీలను, నాయకులను ఎదుర్కోలేక పిరికి రాజకీయాలు చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Kasturi: అనసూయ ఆంటీ వివాదంపై.. కస్తూరి ‘డర్టీ’ మీనింగ్
Also Read
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
బీజేపీ తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుని సహోదరులుగా చూపించి.. ప్రతిపక్షాల నాయకులను అవినీతిపరులుగా చిత్రీకరించి కుటిల ప్రయత్నాలను చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ చేస్తోన్న నీతిలేని, దుర్మార్గపు రాజకీయాలను దేశం గమనిస్తోందని హెచ్చరించారు. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పి కొడతారని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో బీజేపీ నాయకులకు ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాబలం లేక దొడ్డిదారిన రాజకీయాలు చేయడం, అధికారంలోకి రావడం బీజేపీకి అలవాటుగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశంలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిన అప్రజాస్వామిక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. తన ప్రలోభాలకు లొంగకుండా నిలబడిన పార్టీలను దెబ్బతీసే కుట్రలను బీజేపీ చేస్తోందని ఆరోపణలు చేశారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసి బీజేపీ భంగపడిందని వెల్లడించారు. బీజేపీ కుటిల ప్రయత్నాలను కెమెరాల సాక్షిగా ప్రజలు గమనించారని.. బీజేపీ అప్రజాస్వామిక, దుర్మార్గపూరిత కుట్రలకి కాలం దగ్గర పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Facebook Love Story: ఫేస్‌బుక్‌లో ప్రేమ.. రెండేళ్ల తర్వాత పెళ్లి.. కట్ చేస్తే!
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!