Etela Rajender Fires On CM KCR Over Liquor Scam: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యేల ఈటెల రాజేందర్ మరోసారి ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ప్రజా గోస బీజేపీ భరోసాలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ రైతు బంధు పేరుతో డబ్బిలిచ్చి, ధాన్యం తరుగు పేరిట నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘‘దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అని కేసీఆర్ అంటున్నాడు.. ఎందులో తెలుసా? ఏ రాష్ట్రానికి లేని లిక్కర్ ఆదాయంలో నెంబర్ వన్’’ అంటూ వ్యాఖ్యానించారు. 2018లో 70 లక్షల మహిళా ఓట్ల కోసం మహిళ సంఘాలకు వడ్డీ మాఫీ ఇస్తే.. ఇప్పటివరకు మాఫీ కాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఒకపక్క కల్యాణ లక్ష్మితో పెళ్లిళ్లు చేస్తూనే.. మరోపక్క లిక్కర్ తాగించి పుస్తెలతాడు తెంపుతోందని అన్నారు. మోటార్ల కరెంట్ బిల్లు లేక రైతుల నుండి ఏసీడీ పేర వసూల్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Maha Shivratri celebrations in US: అమెరికాలో మహా శివరాత్రి సంబరాలు..
అంతకుముందు.. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈటెల విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతున్న మాటలు కాగితాలకే పరిమితమైయ్యాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సమస్యలపై హామీలు మాత్రమే ఇస్తుందని.. వాటిని అమలు చేయడంలేదని మండిపడ్డారు. దళిత బంధు పథకం పూర్తిగా దళితులకు అందడం లేదన్న ఆయన.. అదెపపుడు పూర్తిగా అమలవుతుందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జరుగుతన్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇచ్చిందని అన్నారు. అదే సమయంలో తన పేరుని కేసీఆర్ పదే పదే ప్రస్తావించడంపై మాట్లాడుతూ.. తన పేరుని కేసీఆర్ ప్రస్తావించిన మాత్రాన పొంగిపోనని, తనపై చేసిన దాడిని మర్చిపోనని అన్నారు. బీఆర్ఎస్‌లో సైనికుడిగా పని చేశానని, బీజేపీలోని అలాగే పని చేస్తానని చెప్పారు. అసెంబ్లీలో కేసీఆర్ తనని డ్యామేజ్ చేశారని, దాన్ని సరిచేసుకోవడానికి తనకు ఎన్ని నెలలు పడుతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు.
Body Parts Found in Park: పార్క్‌లో మహిళ శరీర భాగాలు.. భర్త అరెస్ట్