ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 1న జీతం రావడం లేదు.. పింఛన్ ఇవ్వడం లేదు.. ఏపీ లో ఖజానా ఖాళీ అయింది…ప్రభుత్వం దివాళా తీసింది అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. మద్యం, ఇసుక మాఫియా కారణంగా ఖజానా ఖాళీ అయిందని, ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ద్వారా వేతనం పెంచకుండా తగ్గించిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఏపీలో…
టెలికం దిగ్గజం జియో దేశంలోని టాప్ 1,000 నగరాలకు 5జీ నెట్వర్క్ కవరేజ్ ప్లానింగ్‌ను పూర్తి చేసిందని, దాని ఫైబర్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు సైట్లలో పైలట్‌ను నడుపుతోందని కంపెనీ సీనియర్ అధికారి ప్రెజెంటేషన్ సందర్భంగా తెలిపారు. భారతదేశంలో 5జీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి కంపెనీ బృందాలను రూపొందించినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. “దేశవ్యాప్తంగా 1,000 అగ్ర నగరాలకు 5జీ కవరేజ్ ప్రణాళిక పూర్తయింది. జియో తన 5జీ…
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడింది.శనివారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో లతా మంగేష్కర్ కు చికిత్స చేస్తున్న డాక్టర్ ప్రతిత్ సమదానీ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు. “గాయని లతా మంగేష్కర్ ఇప్పటికీ ఐసీయూలో ఉన్నారు, కానీ ఈ రోజు ఆమె ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదల ఉంది. ఆమెను ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ”అని డాక్టర్ పేర్కొన్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని లతా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గిరిజన మహిళలపై విచక్షణ రహితంగా ఓ అటవీ శాఖ అధికారి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జిల్లాలోని ములకలపల్లి మండలం సాకివలస గ్రామంలో ఆదివాసీ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఫారెస్ట్ బీట్ గార్డు మహేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు పోటు రంగారావు డిమాండ్ చేశారు. కట్టెలు కొట్టేందుకు అడవికి వెళ్లిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ గార్డు దాడికి…
ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లో కుమారుడి అంత్యక్రియల సందర్భంగా హెల్మెట్ వినియోగించాలంటూ ఓ తండ్రి చేసిన విజ్ఞప్తి అందరినీ కలచివేసింది. ఖమ్మం బస్టాండ్ సమీపంలో జనవరి 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఎం బంజర్ గ్రామం వద్ద సోమ్లానాయక్ తండాకు చెందిన తేజావత్ సాయి(18) తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అంతిమయాత్రలో ఉన్న యువకుడి తండ్రి తేజావత్ హరి తన కుమారుడి మృతితో భావోద్వేగానికి లోనయ్యారు.…
గుడివాడలో జరిగిన ఘటనలో కుట్రకోణం ఏమైనా ఉందా అనే అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు వెల్లడించారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ఆరుగురు సభ్యులతో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీకి అనుమతి ఇచ్చామని, కానీ నిబంధనలు అతిక్రమించి వందలాది మందితో టీడీపీ నాయకులు వచ్చారన్నారు. గుడివాడలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను కృష్ణా జిల్లా పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ, చాకచక్యంగా అదుపు చేశారని…
ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీనీ అనుమతించమని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలను.. ట్రేడ్ యూనియన్ నేతలను మాత్రం ఉద్యమంలోకి అనుమతిస్తామని, సీపీఎస్ రద్దు అంశంపై గట్టిగా ఉద్యమిస్తామన్నారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధి సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న నోటీసు ఇస్తామని, 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడుతామన్నారు.…
ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఏకమై పీఆర్సీ సాధన సమితి పేరిట ఉద్యమాన్ని ప్రారంభిచనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమితి నేతలు సీఎస్ సమీర్ శర్మతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం సీఎస్ కు విజ్ఞాపన పత్రాన్ని పీఆర్సీ సాధన సమితి నేతలు అందజేశారు. కొత్త పీఆర్సీ అమలు అంశాన్ని అబయెన్సులో పెట్టాల్సిందిగా సీఎస్ కు ఇచ్చిన…
మాదక ద్రవ్యాలను రవాణా చేసేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త పంథాలను వెతుకుతున్నారు. స్మగ్లర్లు ఎన్ని ప్లాన్లు చేసిన కస్టమ్స్ అధికారులు తిప్పికొడుతున్నారు. అలాంటి ఘటనే ఇది .. ఉగాండా దేశానికి చెందిన జూడిత్ అనే వ్యక్తి భారీగా హెరాయిన్ తరలించేందుకు ప్లాన్ చేసాడు. కస్టమ్స్ అధికారులను ఏమార్చి మాదక ద్రవ్యాలను తరలించేందుకు పథకం పన్నాడు. దాని కోసం కేటుగాడు 7 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను…
ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని.. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని కోరుతూ మళ్లీ సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ లోని సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతల భేటీ అయ్యారు. పీఆర్సీ సాధనా సమితి పేరుతో ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఎన్జీవో హోంలో సమావేశానికి కొనసాగింపుగా అప్సా కార్యాలయంలో నేతల సమావేశం నిర్వహించారు. సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు…