కరోనా మహమ్మారితో దేశమంతా పోరాడుతుంటే.. కరోనాను కూడా క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో, కరోనా వాక్సినేషన్ సర్టిఫికెట్లు కూడా నకిలీవి సృష్టించి డబ్బులు దండుకుంటున్నారు. అయితే అలాంటి రెండు ముఠాల ఆటను సౌత్ జోన్ పోలీసులు కట్టించారు. ఈ సందర్బంగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ చక్రవర్తి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో నకీలు ఆర్టీపీసీఆర్, కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాలను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. రెండు గ్యాంగ్ లకు సంబంధించిన…
సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంబరాలు వికారంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని ఆయన జ్యోస్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ లక్ష్యంగా పాలన సాగిస్తుందని, టీఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో దోచుకో దాచుకో…
తెలంగాణ లో ఉద్యోగాలు లేవనే అబద్ధప్రచారం జరుగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియామకాల్లో ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదని, లక్ష 32 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 40 వేల ఉద్యోగాలు ఇచ్చామని, బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీ లో 19 వేలు, బీహార్ లో 8.950 కర్ణాటక 14,893, మహారాష్ట్రలో 8వేలు పబ్లిక్ సర్వీస్ కమిషన్…
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డితో కలిసి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ ఈరోజు జూమ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్.కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ వైపు వేలు చూపించే ముందు టీఆర్ఎస్ నేతలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళిత, గిరిజనుల బతుకులు…
తెలంగాణలో మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదనంగా రూ.4,500 కోట్ల రాబడికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆస్తులు, భూముల విలువపై సహేతుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 శాతం పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. Read Also: శరవేగంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.. 4 రోజుల్లో 45 అటు స్థలాల విలువను 35 శాతం,…
రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర వాటాగా రాబోయే యూనియన్ బడ్జెట్లో రూ.7,778 కోట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం కోరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ కేపీహెచ్ బీ-కోకాపేట్-నార్సింగి కారిడార్, వరంగల్ మెట్రో-నియో ప్రాజెక్ట్‌తో పాటు మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (MRTS), మెట్రో నియో నెట్‌వర్క్‌తో సహా పలు ప్రాజెక్టులకు నిధులు కోరారు. స్ట్రాటజిక్…
శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య 216 అడుగుల ఎత్తైన విగ్రహం ఫిబ్రవరి 5న ప్రపంచానికి అంకితం కానున్నది. కూర్చున్న స్థానంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా పేర్కొనబడిన ఈ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నట్లు చిన జీయర్ స్వామీజీ ఆశ్రమం ఓ ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నగర శివార్లలోని 45 ఎకరాల కాంప్లెక్స్ వద్ద, రూ. 1,000 కోట్ల ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుండి వచ్చిన విరాళాల ద్వారా నిధులు సమకూర్చబడింది.…
నిర్దిష్టమైన అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, గోదాములు వంటి అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండీఏ ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న కూల్చివేత చర్యల్లో భాగంగా గురువారం నాల్గవ రోజు ఐదు మున్సిపాలిటీల పరిధిలో 12 పెద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. మొత్తంగా గత నాలుగు…
నేటి సమాజంలో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు గొడవపడి క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాలను అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఇది.. భర్త తలను భార్య విచక్షణ రహితంగా నరికి చంపినా ఘటన ఏపీలోని రేణుగుంటలో చోటుచేసుకుంది. గురువారం రేణిగుంటలోని ఓ మహిళ తన భర్త తలను నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. పోలీస్ లైన్స్ రోడ్డులో రవిచంద్రన్ (53), వసుంధర అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి…
కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను తీవ్రం చేయడమే కాకుండా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ కేరళలో మాత్రం కరోనా కాంప్రమైజ్ కానంటోంది. తాజాగా…