టెలికం దిగ్గజం జియో దేశంలోని టాప్ 1,000 నగరాలకు 5జీ నెట్‌వర్క్ కవరేజ్ ప్లానింగ్‌ను పూర్తి చేసిందని, దాని ఫైబర్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు సైట్‌లలో పైలట్‌ను నడుపుతోందని కంపెనీ సీనియర్ అధికారి ప్రెజెంటేషన్ సందర్భంగా తెలిపారు. భారతదేశంలో 5జీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి కంపెనీ బృందాలను రూపొందించినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.
“దేశవ్యాప్తంగా 1,000 అగ్ర నగరాలకు 5జీ కవరేజ్ ప్రణాళిక పూర్తయింది. జియో తన 5జీ నెట్‌వర్క్‌లో హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో అధునాతన వినియోగాలపై ట్రయల్స్ చేస్తోంది. ”అని జియో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రెజెంటేషన్ సందర్భంగా థామస్ మాట్లాడుతూ కంపెనీ వివిధ నగరాల్లో 5జీ పైలట్‌ను నడుపుతోందని, 3డీ మ్యాప్‌లను ఉపయోగించి 5జీ యొక్క రోల్ అవుట్ కోసం నెట్‌వర్క్ ప్లానింగ్ జరుగుతోందనట్లు అంతేకాకుండా రే ట్రేసింగ్ టెక్నాలజీ జరుగుతోందని చెప్పారు.
“మేము నెట్‌వర్క్ ప్లానింగ్‌లో అత్యంత ఆధునిక విధానాలను ఉపయోగిస్తున్నాము. ముఖ్యంగా డీ మ్యాప్‌లు మరియు రే ట్రేసింగ్ టెక్నాలజీలను వినియోగిస్తున్నాము. ఎందుకంటే 5జీ చాలా ప్రత్యేకమైన సాంకేతికత, దీనికి చాలా అధునాతన నెట్‌వర్క్ ప్లానింగ్ పద్ధతులు అవసరం. 5జీ తో మరింత ఉత్తమమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాము.”అని థామస్ చెప్పారు.