IndiGo CEO Apology: ఇండిగో విమానయాన సంస్థ గత మూడు రోజులుగా ఆపరేషనల్ సమస్యలను ఎదుర్కొంటోంది. భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో పాటు అనేక ఫ్లైట్లు ఆలస్యమవుతుండటంతో దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు (డిసెంబర్ 4న) అధికారికంగా క్షమాపణలు చెప్పారు.
Shocking : చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో, ఇది హత్య, ఆత్మహత్యనా లేక డ్రగ్స్ ఓవర్డోసా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకులను పోలీసులు జహంగీర్, ఇర్ఫాన్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మరణాలు సహజంగా సంభవించి ఉండకపోవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆటో లోపల కీలక ఆధారాలు…
Bomb In Flight: అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇటీవల సర్వసాధారణం అవుతున్న నేపథ్యంలో.. తాజాగా కువైట్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad International Airport)కు వస్తున్న ఇండిగో విమానానికి (ఫ్లైట్ నెంబర్: 6E 1234) బాంబు బెదిరింపు మేయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. కువైట్ నుండి అర్ధరాత్రి 1:30 గంటలకు బయలుదేరిన ఈ విమానం ఉదయం 8:10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం సిబ్బందికి బాంబు బెదిరింపు…
Robbery Gang Arrest : గత నెల 7వ తేదీన మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట్ లో ఓ జ్యువెలర్ షాప్ లో జరిగిన దొంగతనాన్ని ఛేదించి రాజస్థాన్ కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి దగ్గర నుండి సుమారు 15 కిలోల వెండి ఆభరణాలను దుండిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. బౌరంపేటలోని సోమేశ్వర్ జ్యువెలరీ షాపు పక్కన ఖాళీగా ఉన్న ఒక షట్టర్ను గమనించిన దుండగులు పథకం ప్రకారం షట్టర్ ను అద్దెకు తీసుకొని రాత్రి…
మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని.. ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. మేడారం అభివృద్ధి పనులపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాతి పనులతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి చూసే ప్రదేశాలు…
IBomma Ravi Case : ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలను హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. రవిని పోలీసులు ఎలా ట్రాప్ చేశారు, అతనికి అనుమానం రాకుండా ఎలాంటి ఈ-మెయిల్స్ పంపించారు, రవిని హైదరాబాద్కి రప్పించేందుకు ఎలా వ్యూహం రచించారు వంటి కీలక అంశాలను ఆయన వివరించారు. అలాగే ఐబొమ్మ రవి అకౌంట్లకు డబ్బులు ఎలా వచ్చాయి, యాడ్ కంపెనీల పాత్ర ఏమిటన్నది కూడా ప్రజెంటేషన్లో స్పష్టమైంది.…
ఐ బొమ్మ రవి కేసు దర్యాప్తులో బయటపడిన అంశాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. పోలీసులు రివీల్ చేసిన కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారం, రవి తొలి నుంచే క్రిమినల్ మెంటాలిటీతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నేర స్వభావం ఉండడమే కాకుండా, స్నేహితుడు నిఖిల్ పేరుతో నమోదు చేసిన ఐడీ కార్డులను ఉపయోగించి అక్రమ కార్యకలాపాలు కొనసాగించినట్టు పోలీసులు గుర్తించారు. రవి నడవడి, అతని బ్యాక్గ్రౌండ్ గురించి కీలక వివరాలు కూడా బయటపడ్డాయి. దర్యాప్తులో భాగంగా రవి భార్యను కూడా…
Sri SathyaSai Dist: శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి మహా సమాధిని భక్తులు అలంకరించారు.
ఇవాళ (నవంబర్ 23న) కాంచీపురం జిల్లాలో 2 వేల మంది పార్టీ కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించనున్నారు. దీనికి పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేపట్టారు. ఈ సమావేశానికి భద్రతకు సంబంధించి ఇప్పటికే పార్టీకి కార్యకర్తలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు.