ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోము వీర్రాజును ఇప్పుడు అందరూ సారా వీర్రాజు అనే పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పై మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను సారా వీర్రాజు చేస్తున్నాడని, జగన్ చిటికెన వేలు కూడా తాకే స్థాయి లేని వ్యక్తి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి సారా వీర్రాజు.. సీఎంను దేశ ద్రోహి అని వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బీజేపీ వ్యక్తే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 40 దేవాలయాలను కూల్చేశారని, దేవాలయాలను కూల్చేసిన చరిత్ర బీజేపీది అంటూ వ్యాఖ్యానించారు.
దేవాలయాలను కడుతున్నది వైసీపీ ప్రభుత్వమని, సారా వీర్రాజు దేశ భక్తుడా…తెలుగు దేశం భక్తుడా? అని ఆయన ప్రశ్నించారు. కాసినో గోవాలో ఉంది.. మరక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంది..? బీజేపీకి ఇలాంటి అధ్యక్షుడు ఉండడం దురదృష్టం. సునీల్ థియోధర్ పప్పులు ఏపీలో ఉడకవు. టీడీపీ కాసినో పై ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు విచారణ చేస్తున్నారు. టీడీపీది నిజ నిర్ధారణ కమిటీ కాదు దిక్కుమాలిన కమిటీ. గుడివాడలో కూడా అశాంతి సృష్టిచాలని చూశారు అని మంత్రి అన్నారు.