ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత కఠిన శిక్షలు వేసిన కామాంధులు మాత్రం మారడం లేదు. అన్యం పుణ్యం తెలియని చిన్నారులపై మృగాళ్ల పడి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో నిన్న 6 ఏళ్ల చిన్నారిపై గుర్రం కిషోర్ (28) అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. అయితే సదరు అమ్మాయి తమ్ముడు అరవడంతో నిందితుడు గుర్రం కిషోర్ పారిపోయాడు. ఈ నేపథ్యంలో నేడు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహిస్తుండగా.. కిషోర్ చేసిందంతా.. చెప్పడంతో ఛీ నువ్వు మనిషివేనా.. అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి కిషోర్ కు దేహశుద్ది చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు గ్రామస్తులు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.