బొత్స.. బౌన్స్ బ్యాక్! ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. విశాఖ కేంద్రంగా ఈ మాజీ మంత్రి చక్రం తిప్పనున్నారా..? వైసీపీకి పూర్వవైభవం కోసం ఇదే సరైన నిర్ణయం అని హైకమాండ్ భావిస్తోందా..? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ పరిణామాల వెనుక రీజనేంటి.? వైఫల్యం నేర్పిన పాఠమా లేక.. స్ధానిక నాయకత్వానికి పెద్దపీట వేసే వ్యూహమా…? వైసీపీ అంతర్గత పరిణామాలు వేగంగా మారుతున్నట్టే కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టమ్ తర్వాత వైఫల్యాలను…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్నారు.. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్.. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.. ఆ తర్వాత బొత్సను తమ అభ్యర్థిగా ప్రకటించారు వైఎస్ జగన్..
అవగాహానలేని చేతలు, మాటలు మాట్లాడే సెలబ్రెటీ అని పవన్ ను దుయ్యబట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి, ప్రధాని మీద మాట్లాడి పెద్ద వాడైపోయానుకుంటున్నాడని ఆరోపించారు. అసలు నీ విధానం ఏంటి? పార్టీ ఏంటంటే సమాధానం లేదన్నారు మంత్రి. 15 ఏండ్లు అవుతుంది రాజకీయ దుకాణం తెరిచి.. ఆ దుకాణంలో ఏ వస్తువు లేదు, క్వాలిటీలేదని ఆరోపించారు.
విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ లో ఉపాధ్యాయుల బదిలీలు, రేపటి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బదిలీలు చేపట్టామని తెలిపారు.
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో, ఇన్నాళ్లూ పేదల పట్ల, బడుగుల పట్ల ప్రదర్శించిన నిరంకుశమైన ఆలోచనసరళికి తగిన సమాధానం చెప్పిన తర్వాతనే, ఆయన పేదల పల్లెల్లో పర్యటించాలని మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.