ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలలో దూకుడు పెరుగుతుంది. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఝులిపిస్తున్నారు. తాజాగా.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన గడపగడపకు విజయోత్సవ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Solar Plant: దేశంలోనే రెండవ అతిపెద్ద సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న కంపెనీ
అవగాహానలేని చేతలు, మాటలు మాట్లాడే సెలబ్రెటీ అని పవన్ ను దుయ్యబట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి, ప్రధాని మీద మాట్లాడి పెద్ద వాడైపోయానుకుంటున్నాడని ఆరోపించారు. అసలు నీ విధానం ఏంటి? పార్టీ ఏంటంటే సమాధానం లేదన్నారు మంత్రి. 15 ఏండ్లు అవుతుంది పవన్ కళ్యాణ్ రాజకీయ దుకాణం తెరిచి.. ఆ దుకాణంలో ఏ వస్తువు లేదు, క్వాలిటీలేదని ఆరోపించారు. మరోవైపు వాలంట్స్ మీద కూడా మాట మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తికి లోకల్ స్టాండ్ లేదా అని అన్నారు. రాత్రి ఒక మాట, పగలు ఒకమాట.. సెట్ అయితే ఒక మాట, సెట్ కాకపొతే మరోమాట మాట్లాడుతాడని తెలిపారు. ఇలాంటి వారితో ప్రజాస్వామ్యం అంటే రాజకీయాలంటే అసహ్యం వేస్తుందని మంత్రి బొత్స పేర్కొన్నారు.