ఏపీలో అమరావతి ఆర్ 5 జోన్ వివాదం ప్రస్తుతం కాకరేపుతోంది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చేందుకు ఆర్ 5 జోన్ ఏర్పాటు చేయడమే కాకుండా దీనిపై కోర్టుల్లోనూ విజయం సాధించిన వైసీపీ సర్కార్ ఇప్పుడు విపక్షాలపై విరుచుకుపడుతుంది. ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబును వైసీపీ మంత్రులు టార్గెట్ చేస్తున్నారు. గతంలో అమరావతిని స్మశానం అంటూ చేసిన వ్యాఖ్యలపైనా వివరణ ఇస్తున్నారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో, ఇన్నాళ్లూ పేదల పట్ల, బడుగుల పట్ల ప్రదర్శించిన నిరంకుశమైన ఆలోచనసరళికి తగిన సమాధానం చెప్పిన తర్వాతనే, ఆయన పేదల పల్లెల్లో పర్యటించాలని మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.
Also Read : Etela Rajender : నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు.. బీజేపీ హై కమాండ్ తెలంగాణపై సీరియస్‌గా ఉంది
మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి రాజధాని మొత్తాన్ని శ్మశానమని అనలేదని మరో మంత్రి మేరుగు నాగార్జున ఇవాళ క్లారిటీ ఇచ్చారు. మంత్రి శ్మశానమని ఏ ఆలోచనలతో ఏం మాట్లాడారో అన్నది ఒక ఎత్తు అయితే చంద్రబాబు డెమోగ్రాఫికల్ సమతుల్యత ఇబ్బంది అవుతుందని అన్నది మరో ఎత్తని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్లి ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మంత్రి మేరుగ ప్రశ్నించారు. ఆర్ 5 జోన్ లో ఇళ్లస్థలాలు ఇచ్చే వారంతా ఈ ప్రాంత లబ్దిదారులే అన్నారు. ఇక్కడి నుంచే విజయవాడ -గుంటూరు ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారని మంత్రి నాగార్జున వెల్లడించాడు. ఇక్కడ ఇళ్లస్థలాలు పొందే లబ్దిదారులంతా రాత్రిపూట ఇక్కడే నివాసం ఉంటున్నారన్నారు.
Also Read : Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం..
పేదలకు ఇంటి జాగా ఇవ్వడంపై స్వయంగా సుప్రీంకోర్టు మొట్టికాయలేసినా కూడా… చంద్రబాబు ఫ్యూడలిజం మనస్తత్వంలో ఎక్కడా మార్పు రాలేదని మంత్రి మేరుగు ఆరోపించారు. పేదవాళ్లకు ప్రభుత్వం ఇచ్చే భూమిని సమాధులతో పోల్చాడన్నారు. ఈ మాట మాట్లాడటానికి ఆయనకు నోరెలా వచ్చింది.. ఏంటి, నీ అహంకారం..? అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ప్రశ్నించారు. పేదవారిని, బడుగుల జీవితాలను హేళన చేస్తూ, అనేక సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడాడు అంటూ ఆరోపించాడు. ఆఖరికి పేదవాళ్ల ఇంటి స్థలాన్ని సమాధులతో పోల్చిన చంద్రబాబును ఎక్కడికెళ్లినా పేదలంతా నిలదీయమని మంత్రి మేరుగు పిలుపునిచ్చారు.