ఏపీలో ఉత్కంఠ రేపుతున్న రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధుల ఖరారు పూర్తయింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు అవకాశం ఇచ్చారు. బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంనుంచి ఖాళీ అయిన నాలుగు స్థానాలకు అభ్యర్ధుల్ని ఫైనల్ చేశారు. నాలుగింట సగం స్థానాలు బలహీన వర్గాలకే ఇచ్చారని, ఈ స్థాయిలో బలహీన వర్గాలకు…
వారసులను జనాల్లోకి వదిలేందుకు విజయనగరం జిల్లాలోని సీనియర్ పొలిటీషియన్స్ వేయని ఎత్తుగడ లేదు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇలా పలువురు ప్రజాప్రతినిధులు.. తమ ఇంటి నుంచే భవిష్యత్‌లోనూ పొలిటికల్ యాక్టివిటీస్ కొనసాగాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వారు చేపడుతున్న పనులు.. రచిస్తున్న వ్యూహాలు ఆసక్తిగా ఉంటున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్.. డాక్టర్. సందీప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బొత్స పెద్ద…
ఏపీ మంత్రివర్గం కూర్పుపై సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆదివారం కూడా కొనసాగనుంది. రేపు మరోసారి సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల. మధ్యాహ్నం 12 గంటలకు వీరిద్దరూ భేటీ కానున్నారు. ఇవాళే తుది జాబితా సిద్ధం చేసే దిశగా కసరత్తు ప్రారంభం అయినా ఇంకా కొలిక్కిరాలేదని తెలుస్తోంది. సీఎం, సజ్జల వరుస భేటీల పై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.…
పీఆర్సీ విషయంలో సందిగ్దత తొలగించేందుకు రెడీ అవుతున్నారు. అటు మంత్రుల కమిటీ సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇటు స్టీరింగ్ కమిటీ కూడా పట్టువిడుపులకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించింది. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు కమిటీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్న అంశాలు ఉన్నాయి. కొన్నింటి పై ప్రభుత్వం, కొన్ని అంశాల్లో మేము సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. సమ్మె నోటీసులో ఇచ్చిన అన్ని అంశాలపై ఉద్యోగులు…
ఏపీలో పీఆర్జీ జీవోలు రద్దుచేయాలని ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో గెజిటెడ్ అధికారుల జేఏసీ చర్చలకు వెళ్ళడంలేదన్నారు. సోమవారం హైకోర్టు నిర్ణయాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుందన్నారు. కొత్త పీ ఆర్ సీ అంశం హై కోర్టు లో విచారణ ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ పై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులు కాపాడుకునేందుకు చివరి వరకు పోరాడతాం అన్నారు. గతంలో ఉద్యోగుల హక్కులు కాపాడే…
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. ప్రభుత్వం బిల్లుని ఉపసంహరించుకోవడం… మళ్ళీ సమగ్రంగా బిల్లుని ప్రవేశపెడతామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో రాష్ర్ట మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజధానుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా విశాఖ పరిపాలనా రాజధానిగా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చంద్రబాబు కుట్ర చేసారు. ప్రభుత్వం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంది. అమరావతి రైతులు అర్ధం చేసుకోవాలన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.…
తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లోకేష్ ను తిడుతున్నట్టుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీ క్యాడర్‌ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలేస్తున్నారని ఒక టీడీపీ నేత.. అచ్చెన్నాయుడు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. తనకు పార్టీలో జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. ‘ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం…