మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిని అరెస్ట్ చేయండి.. డీజీపీకి లేఖ..
మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. అయితే, ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేసింది ఏపీ మహిళా కమిషన్.. మంత్రి రోజాపై జుగుప్సాకరంగా మాట్లాడిన బండారు సత్యనారాయణను అరెస్టు చేయాలంటూ డీజీపీకి రాసిన లేఖలో కోరారు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ..
రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాపై సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు వాసిరెడ్డి పద్మ.. శనివారం డీజీపీకి లేఖ రాస్తూ.. బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని పేర్కొన్నారు. ఒక మంత్రిపై రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్ లు పెట్టి మరీ.. బండబూతులు మాట్లాడుతున్నారని.. వీటిని ఎంత మాత్రం సహించరాదని పేర్కొన్న ఆమె.. వెంటనే కేసు నమోదు చేసి.. తక్షణం అరెస్టు చేయాలని డీజీపికి విజ్ఞప్తి చేశారు.
బ్రేకింగ్.. భద్రాచలంలో భారీ వర్షం.. కేటీఆర్ పర్యటన రద్దు
మంత్రి కేటీఆర్ భద్రాచలం పర్యటన రద్దైంది. భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో భద్రాచలం పర్యటన రద్దు చేసుకొని కేటీఆర్ సత్తుపల్లి పయనం అయ్యారు. భద్రాచలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం రావడంతో మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం భద్రాచలం సత్తుపల్లిలో ఈరోజు మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుండగా ఉదయం ఖమ్మంలో పర్యటన పూర్తయింది. అనంతరం తిరిగి భద్రాచలం వెళ్లడానికి సిద్ధమవుతుండగా భద్రాచలంలో భారీ వర్షం , వాతావరణ అనుకూలించక పోవడంతో హెలికాప్టర్ కి సమస్య ఎదురైంది. ఈనేపథ్యంలో భద్రాచలం పర్యటన కేటీఆర్ రద్దు చేసుకుని సత్తుపల్లి వెళ్లారు. ప్రస్తుతం సత్తుపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది.
చంద్రబాబు అరెస్టు పై స్పందించిన హరీష్ రావు
మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు. పాపం ఈ వయసులో ఆయన్ను అరెస్ట్ మంచిది కాదని తెలిపారు. గతంలో అయిన ఐటీ ఐటీ అన్నాడు కానీ ఇప్పుడు చాలా మంచి మాట చెప్పాడని అన్నారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు తీసుకోవచ్చని చెప్పారని మంత్రి తెలిపారు. కేసీఆర్ పాలన బాగుంది కాబట్టే చంద్రబాబు అలా అన్నారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం పూర్తి అయ్యేదా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మగౌరవం, ఆదాయం పెంచిన నాయకుడు అని అన్నారు.
ఎల్ఓసీ వెంబడి చొరబాటు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చిన ఇండియన్ ఆర్మీ..
జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రసంస్థలు, పాకిస్తాన్ కుట్రలు చేస్తూనే ఉన్నాయి. పీఓకే నుంచి జమ్మూకాశ్మీర్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. ఎల్ఓసీ వెంబడి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ నుంచి ఉగ్రవాదుల్ని ఇండియాలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే టెర్రిస్టుల ప్రయత్నాలను ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొడుతోంది.
తాజాగా పీఓకే నుంచి జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదుల్ని ఇండియన్ ఆర్మీ హతమార్చింది. ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్ ప్రాంతంలో ఎల్ఓసీ వెంబడి ఈ ఆపరేషన్ జరిగింది. మరోవైపు ఈ రోజు తెల్లవారుజామున పుల్వామా జిల్లాలోన గుల్షన్‌పోరా త్రాల్ లోని గుజార్ బస్తీ ప్రాంతంలో రెండు ఉగ్రవాద స్థావరాలను భద్రతా బలగాలు ఛేదించాయి.
ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుoబoపై వ్యతిరేకత కనిపిస్తోందని, అధికార మంత్రులు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి అందుకే బీజేపీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యం కలిగిన వారు.. కేసీఆర్ లా ఫామ్ హౌస్ లో పడుకోవడానికి ప్రదానీ మోడీ రాష్ట్రానికి రావడం లేదని ఆయన అన్నారు. వేల కోట్లు తెలంగాణ ప్రజా సంపద దోచుకున్న కేసీఆర్ కుటుoబానికి మోడీని విమర్శించే నైతిక హక్కు లేదని, మోడీ అనేక అభివృద్ధి పనులకోసం రాష్ట్రానికి వస్తుంటే కేసీఆర్ కు రావడానికి సమయం ఉండదన్నారు కిషన్ రెడ్డి.
మీరు ఏ దేశానికి భక్తులు? పాకిస్తాన్ కా… ఆఫ్ఘనిస్తాన్ కా..?
కరీంనగర్ లో తన పార్లమెంట్ ఆఫీస్, ఇంటి దగ్గర ఎంఐఎం కార్యకర్తలు దాడిని ఎంపీ బండి సంజయ్ ఖండించాడు. బీఆర్ఎస్, ఎంఐఎం బీజేపీ పార్టీని ఎదుర్కోలేక పోతుంది అంటూ మండిపడ్డాడు. బీజేపీ నాయకులు ప్రశ్నిస్తే పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు.. దాడి జరిగింది అని బీజేపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే బీజేపీ కార్యకర్తల పైనే పోలీసులు కేసులు పెడుతున్నారు.. ఎంఐఎం దేశ ద్రోహుల పార్టీ అంటూ ఆయన విమర్శించారు. తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. భాగ్యలక్ష్మీ గుడి వద్ద జనగణమన, వందే మాతరం పాడే దమ్ము బీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు ఉందా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. నిజాం వారసులం కాదు అని బీఆర్ఎస్ నిరూపించుకోవాలి.. బీజేపీ దాడులకు భయపడదు.. మా సహనాన్ని పరీక్షించ వద్దు.. మమ్మల్ని రెచ్చ గొట్టొద్దు అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నరు
మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఅర్ఎస్, కాంగ్రెస్ లోపల కలిసి ఉండి బయటికి కొట్లాడినట్టు నటిస్తున్నాయని విమర్శించారు డీకే అరుణ. అంతేకాకుండా.. పైగా మా పైనే బట్ట కాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని, కొన్ని పత్రికలు వ్యక్తి గత అజెండా తో వ్యవహరిస్తున్నాయని డీకే అరుణ అన్నారు. కొన్ని చానల్స్, పత్రికలు ఉద్దేశపూర్వకంగా ఇతర పార్టీలను లేపే ప్రయత్నం చేస్తున్నాయని, బీజేపీ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిసిన ఈ విధంగా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు. రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక అబివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని, దేశం, రాష్ట్రం కోసం సైనికుల్లా పని చేయాల్సిన అవసరం బీజేపీ కార్యకర్తలకు ఉందన్నారు.
సీఎం జగన్ ను విమర్శిస్తే.. మర్యాద దక్కదు బ్రాహ్మణి..?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణిపై మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఎటాక్ దిగారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు వంటి పేద ప్రజల కోసం.. వారి సంక్షేమం కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచించారా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో దోరికిపోయి జైల్లో కూర్చుంటే సిగ్గు లేకుండా చంద్రబాబు భార్య, ఆయన కోడలు గంట కొట్టండి, విజిల్స్ వేసి సీఎం జగన్ కు బుద్ది చెప్పండీ అంటున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా బ్రాహ్మణి తెలియక మాట్లాడుతోందో.. తెలిసి అబద్ధాలు ట్వీట్ చేస్తున్నారా అనేది అర్థం కావాడం లేదని మంత్రి రోజా అన్నారు.
ఒకవైపు మహాత్మా గాంధీ, మరో వైపు గాడ్సే..ఎంపీ ప్రచారంలో రాహుల్ గాంధీ..
మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గత దశాబ్ధకాలం నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంటోంది. అయితే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరును మహాత్మా గాంధీ, గాడ్సేల మధ్య పోరుగా అభివర్ణించారు.
రాహుల్ గాంధీ బీజేపీ పార్టీని మహత్మా గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సేతో పోల్చారు. ఎంపీలోని షాజాపూర్ లో జరిగిన ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరాటమని, ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఉంలటే మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నాయని, ఒక వైపు మహాత్మా గాంధీ ఉంటే మరో వైపు గాడ్సే ఉన్నారని ఆయన అన్నారు.
దెబ్బకు దెబ్బ తీస్తాం.. మేము ఎవరికి భయపడం..!
నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పార్టీ పొలిటికల్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన చోటే పీఏసీ రెండవ మీటింగ్ ఇక్కడ నిర్వహించాం అని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక కొంతమంది మృతి చెదారు.. వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. 3, 4 కోర్టులో జడ్జిమెంట్ ఉన్నాయి.. జడ్జిమెంట్ వచ్చిన తరువాత చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తాము అని బాలకృష్ణ పేర్కొన్నారు.
హృదయ విదారక ఘటన.. కేటీఆర్ డ్యూటీ కోసం వెళ్లి మృతి ఒడిలోకి
కొద్ది సేపటి లో ఇంటికి వెళ్లాల్సిన మహిళా కానిస్టేబుల్ మృత్యు ఒడిలోకి వెళ్ళింది… మొదటి సారిగా రామాలయం వద్ద వున్న స్లుయిస్ లో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇది.. భద్రాచలం పట్టణంలోని రామాలయం వద్ద జరిగిన ఘోర ఘటన… కేటీఆర్ పర్యటన కోసం ఏర్పాట్లు కు వెళ్లిన మహిళా కానిస్టేబుల్ మృత్యు వాత పడింది. భద్రాచలం అన్నదానం వద్ద డ్రైనేజీ కాలువ లో పడి కొత్తగూడెం కు చెందిన మహిళా కానిస్టేబుల్ మృతి చెందింది. కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న శ్రీదేవి అనే హెడ్ కానిస్టేబుల్ భద్రాచలంలో కేటీఆర్ పర్యటన డ్యూటీ పడింది.. శ్రీదేవి భర్త రామారావు కూడా కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఈ రోజు కేటీఆర్ పర్యటన సందర్భంగా డ్యూటీ వేశారు.
మహ్మద్ సిరాజ్‌పై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..!
ప్రపంచ కప్కు ముందు ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పై దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ కప్ 2023లో సిరాజ్ ఆటతీరు చూడదగినదని స్టెయిన్ చెప్పాడు. ప్రపంచకప్లో అందరి దృష్టి ఫాస్ట్ బౌలర్లపైనే ఉంటుందని స్టెయిన్ అన్నాడు. అందులో మహ్మద్ సిరాజ్.. టీమిండియాకు కీలకమని నిరూపించుకుంటాడని తెలిపాడు. సిరాజ్ బంతితో స్వింగ్ చేయగలడని.. బుమ్రాతో పాటు సిరాజ్ కూడా ముఖ్యమైన బౌలర్ అని చెప్పుకొచ్చాడు.
చంద్రబాబుపై చాలా కేసులున్నాయి.. జనసేన-టీడీపీ కలిసొచ్చిన నష్టం లేదు..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై చాలా కేసులున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు స్టేలు తెచ్చుకొని నెట్టుకొచ్చారు.. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తప్పించుకోలేకపోయారు అని ఆయన విమర్శించారు. తప్పు చేసినప్పుడు చట్టాల నుంచి తప్పించుకోలేరు.. ధర్నాలు, ఆందోళనలతో కేసుల నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు.. అసెంబ్లీలో అనవసరంగా అల్లరి చేశారు.. చంద్రబాబు కేసులపై చర్చించేందుకు ఎందుకు వెనుకడుగు వేశారని బొత్స సత్యనారాయణ తెలిపారు.
నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ అధికారుల నోటీసులు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా లోకేశ్ కు సీఐడీ 41ఏ నోటీసులు పంపించింది. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపింది. నోటీసులు అందినట్లు లోకేశ్ సీఐడీకి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అనంతరం నారా లోకేశ్ న్యాయవాదులతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి నారా లోకేశ్ ఉన్నారు.