ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న పదవ తరగతి ఫలితాల (Ap SSC Exam Results) విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 6వ తేదీ శనివారం టెన్త్ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం జరిగిన చర్చల సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఫలితాలను ఎన్ని గంటలకు విడుదల చేస్తారనే సమాచారం మాత్రం ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించి ఎస్‌ఎస్‌సీ బోర్డు నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందని తెలుస్తోంది.
Read Also: Bandi Sanjay : రాష్ట్రంలో ఉద్యోగాల కోసం కన్నీటి ఎదురు చూపులే
రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలను 6.5లక్షల మందికి పైగా విద్యార్థులు రాసినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగ్గా.. 19 నుంచి 26వరకు స్పాట్ వాల్యుయేషన్ చేపట్టారు. స్పాట్ వ్యాల్యుయేషన్ వేగంగా పూర్తిచేశారు అధికారులు.
Read Also: AP Highcourt: R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు.. హైకోర్ట్ కీలక ఉత్తర్వులు