ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్తు అనే పేరుతో క్యాంపైన్ చేపడుతున్నాం. 7 లక్షల మందితో రాష్ట్రంలోని కోటి 80 లక్షల ఇళ్ళకు వెళుతున్నాం. పార్టీ ఉద్దేశాలను, లక్ష్యాలను ప్రజలకు వివరిస్తారు. గత నాలుగేళ్లుగా మా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తారు. గత ప్రభుత్వం ఏం చేసిందో కూడా బేరీజు వేసుకోవటం జరుగుతుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.