FASTag: ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి వ్యవహారంపై మహారాష్ట్రకు చెందిన వ్యక్తి బాంబే హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేయడం అక్రమమని పేర్కొంటూ ఆ పిటిషన్ దాఖలైంది. అయితే, హైకోర్టు ఈ పిల్ ను తోసిపుచ్చుతూ ప్రభుత్వంతో పాటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయానికి మద్దతుగా తీర్పు వెలువరించింది. అయితే ఈ విషయంలో పిటిషనర్ వాదన ప్రకారం, ఫాస్ట్ ట్యాగ్ లేకుండా ప్రయాణించే వాహనాలపై రెట్టింపు టోల్ విధించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అంతేకాదు, టోల్ ప్లాజాలలో పూర్తిగా ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాల కోసం ప్రత్యేక లేన్లను కేటాయించకపోవడం కూడా నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
Read Also: New Banking Rules: అలర్ట్.. ఏప్రిల్ 1 నుండి మారనున్న బ్యాంకింగ్ నిబంధనలు! ముఖ్యమైన మార్పులు ఏంటంటే?
అయితే, హైకోర్టు 2008 నేషనల్ హైవే ఫీ నిబంధనల ప్రకారం ఫాస్ట్ ట్యాగ్ విధానం చట్టబద్ధమైనదేనని తేల్చింది. ఇకపై ఫాస్ట్ ట్యాగ్ లేకుండా ప్రయాణించే వాహనదారులు ప్రత్యేక లేన్లో క్యాష్ ద్వారా టోల్ చెల్లించవచ్చు. అయితే, వారిపై రెట్టింపు టోల్ చార్జీలు వర్తింపజేయడం తప్పనిసరి. ఇది శిక్ష విధించడం కాదు, చట్టబద్ధమైన టోల్ వసూళ్ల విధానం అని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థ ఒక్కరోజులో అమలులోకి రాలేదని, దశల వారీగా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. 2014లో ప్రారంభమైన ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను ప్రభుత్వం 2017 నాటికి కొన్ని మార్పులు చేసి వాహనాలకు తప్పనిసరి చేసింది. ప్రస్తుతం కొత్తగా తయారయ్యే అన్ని కార్లకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.
Read Also: Volkswagen: 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లు, రూ.2.5 లక్షల తగ్గింపు.. ఆఫర్ ఎప్పటి వరకంటే..?
ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ వసూళ్లను సులభతరం చేసిన తర్వాత, ప్రభుత్వం మరింత కొత్త విధానంతో టోల్ వసూలు చేయడానికి సిద్ధమవుతోంది. అతి త్వరలో GPS ఆధారిత టోల్ విధానం దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. ఇక GPS ఆధారిత టోల్ విధానం అనేది ఉపగ్రహాల ఆధారంగా టోల్ వసూలు చేసే టెక్నాలజీ. ఇది ఫాస్ట్ ట్యాగ్ కంటే ఇది మరింత ఆధునికమైనది. ప్రస్తుతం టోల్ వసూలు కోసం నిర్దిష్ట స్థలాల్లో టోల్ ప్లాజాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ GNSS విధానం ద్వారా, వాహనం ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణించిందన్న విషయాన్ని ట్రాక్ చేసి ప్రయాణించిన దూరాన్ని అనుసరించి టోల్ చార్జీలు విధిస్తారు. దీని ద్వారా డ్రైవర్లు ఆయా హైవే మీద ఎంత ప్రయాణించారో దాని ఆధారంగా మాత్రమే చెల్లింపు చేయాల్సి ఉంటుంది.