Mumbai train blast case: “ముంబై రైలు పేలుళ్ల కేసు”.. ఉరితీయొద్దన్న నిందితుడు.. తీర్పు రిజర్వ్ ..
- 2006 ముంబై రైలు బ్లాస్ట్ కేసులో తీర్పు రిజర్వ్..
- నిందితుల మరణశిక్ష పిటిషన్లను విచారిస్తున్న బాంబే హైకోర్టు..
- తనను ఉరితీయొద్దన్న నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai train blast case: 2006, జూలై 11న ముంబై సబర్బన్ రైళ్లలో 11 నిమిషాల్లో ఆర్డీఎక్స్ పేలుళ్లు సంభవించాయి. ఈ ఉగ్రదాడిలో 189 మంది మరణించగా, 827 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆరున్నర నెలల పాటు జరిగిన విచారణలో నిందితులకు ట్రయల్ కోర్ట్ మరణశిక్షతో పాటు యావజ్జీవ శిక్షలు విధించబడ్డాయి. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన మరణ నిర్ధారణ పిటిషన్లు, అప్పీళ్లపై బాంబే హైకోర్టు శుక్రవారం తన తీర్పుని రిజర్వ్ చేసింది. జూలై 2024 నుంచి ఈ కేసును ముగించడానికి డివిజన్ బెంజ్ విచారణ జరుపుతోంది.
విచారణ చివరి రోజున నిందితులు తమ వాదనల్ని చెప్పుకోవడానికి జస్టిస్ అనిల్ కిలోర్, శ్యాం చందక్‌లతో కూడిన ధర్మాసనం 2 నిమిషాలు అనుమతించింది. నిందితులు పూణేలోని ఎరవాడ జైలు, అమరావతి, నాసిక్, నాగ్‌పూర్ సెంట్రల్ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాదనల్ని వినిపించారు. 12 నిందితుడిగా నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న నవేద్ హుస్సేన్ మాట్లాడాడు. ‘‘తనపై ఉన్న కేసు తప్పుడు కేసు. నేను నిర్దోషిని. నేను ఎవరి కోసం మాట్లాడటం లేదు, నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ కేసుతో నాకు సంబంధం లేదు. అరెస్టుకు ముందు నిందితుల్లో ఒకరితో తప్పా తనకు ఎవరితో సంబంధం లేదు. 19 ఏళ్లుగా బాధపడుతున్నాను. రైలు పేలుడులో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రతీకారం అంటే అమాయకులను ఉరితీయకూడదు’’ అని చెప్పాడు.
Also Read
Read Also: Economic Survey: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఈ కలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేస్తాడా?
నవాద్ హుస్సేన్ రైళ్లలో బాంబులు పెట్టిన వ్యక్తుల్లో ఒకడిగా ఆరోపించబడ్డాడు. ట్రయర్ కోర్టు ఇతడికి మరణశిక్ష విధించింది. హుస్సేన్ విచారణ సమయంలో నేరాన్ని ఒప్పుకున్నాడు. శుక్రవారం విచారణలో హుస్సేన్ తప్ప ఇంకెవరు నిందితులు మాట్లాడలేదు. జూలై 11, 2006న ముంబై సబర్బన్ రైళ్లలో ఏడు ప్రదేశాల్లో 11 నిమిషాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేయగా, 15 మందిని వాంటెడ్‌గా ప్రకటించారు. కొందరు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేశారు. నిందితులపై MCOCA , UAPA కేసులు పెట్టి, నవంబర్ 2006 లో చార్జిషీట్ దాఖలు చేసింది.
9 ఏళ్ల తర్వాత మరణశిక్షను ఎదుర్కొంటున్న దోషుల్లో ఒకరైన ఎతేషామ్ సిద్ధిఖీ హైకోర్టులో మరణశిక్షపై అప్పీల్ చేశాడు. దీనిని విచారించడానికి గతేడాది ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజా థాకరే ఈ కేసుని ‘అత్యంత అరుదైన కేసుల్లో ఒకటి’’ అని వాదిస్తూ మరణశిక్షల్ని నిర్ధారించాలని కోర్టుని కోరారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు 13 మందిలో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి మావజ్జీవ శిక్ష విధించింది. రైలు పేలుళ్లకు ‘‘ఇండియన్ ముజాహిదీన్’’ ఉగ్రసంస్థ పాల్పడినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
ట్రెండింగ్
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!