స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి ‘ద్రోహి’ అంటూ సంబోధించిన కేసులో కునాల్ కమ్రాకు న్యాయస్థానం రక్షణ కల్పించింది. ఏప్రిల్ 16 వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ముంబై పోలీసులకు, ఎమ్మెల్యే ముర్జీ పటేల్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తమ అభిప్రాయాలను తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల మద్రాస్ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను ఏప్రిల్ 17 వరకు పొడిగించింది. ఇదే విషయాన్ని కునాల్ న్యాయవాది నవ్రోజ్ సెర్వై.. బాంబే హైకోర్టు బెంచ్‌కు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: IPL 2025: మంగళవారం రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఇదే మొదటిసారి! కారణం ఏంటో తెలుసా?
షిండేను ఉద్దేశించి కునాల్ కమ్రా ‘ద్రోహి’ అంటూ సంబోధించారు. దీనిపై మహారాష్ట్రలో పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అనంతరం ముంబై పోలీసులు.. మూడు సార్లు కునాల్‌కు సమన్లు జారీ చేశారు. కానీ హాజరు కాలేదు. తనకు ప్రాణ హానీ ఉందని.. వర్చువల్‌కు పోలీసులు అంగీకరించడం లేదంటూ కునాల్ కమ్రా బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం విచారించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 16 వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరో షాక్..