Bombay High Court: వివాహ సమస్యలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి.. చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు..
- వివాహ సమస్యలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి..
- చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు..
- అత్తమామలపై పెట్టిన కేసును విచారిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: తన భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ, తన అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కొట్టివేసింది. వివాహ వివాదాలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయని, మహిళలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలు దుర్వినియోగం చేసే ధోరణ పెరుగుతోందని కోర్టు గమనించింది. వివాహాలను రక్షించడానికి, వివాదాలను పరిష్కరించడానికి రూపొందించిన చట్టాలు తరుచుగా దుర్వినియోగం అవుతున్నాయని కోర్టు ప్రస్తావించింది.
‘‘ వివిధ కారణాల వల్ల ఈ రోజుల్లో వివాహ సమస్యలు సమాజంలో ఒక సమస్యగా మారింది. ఈ వివాహ విభేదాల కారణంగా పోరాడుతున్న వారికి చట్టంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న చిన్న సమస్య మొత్తం జీవితాన్ని పాడు చేస్తోంది. హిందువుల్లో పవిత్రమైన వివాహాలు ప్రమాదంలో ఉన్నాయి’’ అని న్యాయమూర్తులు నితిన్ సాంబ్రే, ఎంఎం నెర్లికర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
Read Also: CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ
గృహహింస చట్టం, హిందూ వివాహాల చట్టం, ప్రత్యేక వివాహాల చట్టాలు పలువురు తరుచుగా దుర్వియోగానికి గురి చేస్తున్న ఫలితంగా, కోర్టులపై భారం పడుతోందని కోర్టు చెప్పింది. ఇదే కాకుండా ఈ సమస్యలు మానసిక, శారీరక వేధింపులు, అంతులేని సంఘర్షన, ఆర్థిక నష్టం, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులపై కోలుకోలేని హాని కలిగించే అనేక కేసులు నమోదవుతున్నాయని ధర్మాసనం తెలిపింది.
మే 2023ల వివాహం చేసుకున్న జంట కేసును విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళ డిసెంబర్ 2023లో నాగ్‌పూర్‌లో ఫిర్యాదు చేసింది. వరకట్న నిషేధ చట్టం కింద ఆమె భర్త, ఇద్దరు సోదరిణులు, అత్తామామలపై కేసు నమోదు చేసింది. వరకట్న వేధింపులు, అసహజ లైంగిక సంబంధం,భూమి, ఆస్తి కోసం డిమాండ్ చేసినట్లు ఆమె వారిపై ఆరోపించింది. అయితే, ప్రస్తుతం తమ వివాదాలు అన్ని పరిష్కారమయ్యాయని సదరు మహిళ, ఆమె తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణ రద్దు చేయాలని కోరారు. దీనికి హైకోర్టు అంగీకరించింది. భార్యభర్తలు శాంతియుతంగా జీవించాలనుకుంటే, వారిని ప్రోత్సహించడం కోర్టు విధి అని ధర్మాసనం పేర్కొంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..