Bombay High Court: వివాహం తర్వాత భర్తతో ‘‘శృంగారానికి’’ నిరాకరించడం కూడా విడాకులకు కారణం కావచ్చని బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇది భర్త పట్ల క్రూరత్వానికి సమామని చెప్పింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ, భార్య పిటిషన్‌ని కొట్టేసింది. భర్తతో శారీరక సంబంధాన్ని తిరస్కరించడం, అతనితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం విడాకులకు కారణం కావచ్చని హైకోర్టు పేర్కొంది.
దీనికి ముందు, విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు.. భర్తతో శారీరక సంబంధానికి నిరాకరించడం, అతడికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించడంతో విడాకులు మంజూరు చేసింది. అయితే, ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను మహిళ హైకోర్టులో సవాల్ చేసింది. మహిళకు హైకోర్టులో కూడా చుక్కెదురైంది. ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. జస్టిస్ రేవతి మోహితే డెరే,జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం ఈ వ్యాఖ్య చేసింది. సదరు మహిళ తన భర్త పట్ల క్రూరత్వంతో వ్యవహరించిందని ధర్మాసనం పేర్కొంది.
Read Also: Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా “రన్‌వే”లు రిపేర్ చేసుకునే పనిలో పాకిస్తాన్..
ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను తిరస్కరించాలని, తనకు నెలకు రూ. లక్ష భరణంగా ఇవ్వాలని మహిళ కోర్టునను కోరింది. దీనిని హైకోర్టు తిరస్కరించింది. 2013లో ఈ జంటకు వివాహం జరిగింది. 2014 నుంచి వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. 2015లో విడాకుల కోసం ఆ వ్యక్తి పూణే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. మరోవైపు, మహిళ కూడా అత్తమామలు వేధిస్తున్నారంటూ కేసు ఫైల్ చేసింది. భర్త తన పిటిషన్‌లో భార్య సె*క్స్ నిరాకరించడం, అనుమానించడం, కుటుంబం-స్నేహితుల ముందు ఇబ్బంది పెట్టడం వల్ల మానసిక వేదన కలిగినట్లు పేర్కొన్నాడు. తన భార్య, తనను వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నాడు. ఈ జంట మధ్య వివాహం విచ్ఛిన్నమైందని, మళ్లీ కలిసి ఉండేందుకు అవకాశాలే లేవని హైకోర్టు భావించి, మహిళ పిటిషన్‌ని తిరస్కరించింది.