బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు రాజ్ కుమార్ హిరానీతో పని చేయాలని కోరుకుంటారు. అటువంటి టాలెంటెడ్, సెన్సిటివ్ డైరెక్టర్ ఆయన. అయితే, ప్రస్తుతం హిరానీ అభిమానులతో పాటూ కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందట. షారుఖ్ తో రాజ్ కుమార్ హిరానీ చిత్రం అంటూ చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్నా ఇప్పుడు కన్ ఫర్మ్ గా షెడ్యూల్స్ గురించిన సమాచారం వినిపిస్తోంది…లాక్ డౌన్ వల్ల…
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘తుఫాన్’. ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ‘భాగ్ మిల్ఖా భాగ్’ తర్వాత ఫర్హాన్ అక్తర్- రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో ‘తుఫాన్’ పై భారీ అంచనాలు వున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను జూన్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పరేశ్ రావల్, మృణాల్ ఠాకుర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ…
గత కొంత కాలంగా, బాలీవుడ్ లో ఎవరైనా, దారుణంగా ట్రోలింగ్ ఎదురుకుంటున్నారంటే…. అది కరణ్ జోహరే! సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నెటిజన్స్ ఒక రేంజ్ లో ఆటాడుకున్నారు. నెపోటిజమ్ పేరుతో కరణ్ ని నానా తిట్లు తిట్టిపోశారు. అయితే, కరోనా కాలంలో కరణ్ ని ట్రోల్ చేయటం ఇంకా సొషల్ మీడియాలో మానటం లేదు. కొనసాగుతూనే ఉంది. తాజాగా కార్తీక్ ఆర్యన్ వ్యవహారంలోనూ కరణ్ జోహర్ విలన్ అయ్యాడు. Read Also: ‘’అందరూ…
బాబిల్ ఖాన్… క్యాన్సర్ తో మరణించిన టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ తనయుడు. ఇన్నాళ్లూ లండన్ లో ఫిల్మ్ కోర్స్ చదువుతున్నాడు. అయితే, తాజాగా ఆయన తన ఫిల్మ్ బీఏ కోర్స్ కి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తాను డ్రాప్ అవుట్ అవుతున్నట్టుగా బాబిల్ ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు. తన ఆప్త మిత్రులు ఇంత కాలం అండగా ఉన్నారనీ, వారికి కృతజ్ఞతలు అంటూ… తన మనసులోని మాటల్ని బయటపెట్టాడు. అంతే కాదు, ఇక మీద…
కార్తీక్ ఆర్యన్… ఈ పేరు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. కారణం… ఆయన చుట్టూ ముసురుకుంటోన్న కాంట్రవర్సీలే! కరణ్ జోహర్, షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థల చిత్రాల నుంచీ కార్తీక్ ని తొలగించారు. దాంతో బీ-టౌన్ లో కార్తీక్ ని టార్గెట్ చేస్తున్నారని దుమారం రేగింది. అయితే, కాంట్రవర్సీల మాట ఎలా ఉన్నా నెపోటిజమ్ కు, స్టార్ కిడ్స్ కు ఫేమస్ అయిన మన బాలీవుడ్ లో ఈ యంగ్ హీరో స్వంతంగా…
బాలీవుడ్ లో అందగాళ్లకు కొదవేం లేదు. కానీ, హృతిక్ రోషన్ రేంజే వేరు! లుక్స్ పరంగానే కాకుండా హైట్, ఫిజిక్ తో కూడా ఆకట్టుకుంటాడు గ్రీక్ గాడ్! ఆపైన తన యాక్టింగ్ టాలెంట్ తో ఎలాంటి సినిమానైనా బాక్సాపీస్ వద్ద బలంగా నిలబెట్టగలడు! అయితే, ఇదంతా హృతిక్ ని, మిగతా స్టార్ హీరోలతో సమానం చేస్తుంది. కానీ, అతడ్ని బాలీవుడ్ లో అందరికంటే స్పెషల్ గా నిలబెట్టేది ‘క్రిష్’ ఫ్రాంఛైజ్!బీ-టౌన్ లో ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ టాప్ ‘సూపర్…
బాలీవుడ్ బాద్షా… కింగ్ ఖాన్… ఇలాంటి టైటిల్స్ షారుఖ్ కి ఊరికే రాలేదు. వాటి వెనుక ఎంతో శ్రమ, అదృష్టం, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి! అందుకే, ఎస్ఆర్కే తో సినిమా అంటే సీనియర్ బ్యూటీస్ మొదలు ఈ తరం న్యూ బేబీస్ వరకూ అందరూ రెడీ అనేస్తారు. కింగ్ ఆఫ్ రొమాన్స్ అనిపించుకున్న షారుఖ్ బాలీవుడ్ హీరోయిన్స్ కి హాట్ ఫేవరెట్! అయితే, ఇదంతా నిజమే అయినా ‘ఆ నలుగురు’ కథానాయికలు మాత్రం ‘సారీ, ఎస్ఆర్కే!’…
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ వరుస అవకాశాలను దక్కించుకుంటూ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత బోయపాటి శ్రీను-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో ‘జుగ్ జుగ్ జియో’, ‘షేర్ షా’ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో మరో…
బాలీవుడ్ లో బయోపిక్స్ జాతర ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఎప్పటికప్పుడూ కొత్త బయోపిక్ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తోన్న బీ-టౌన్ ఫిల్మ్ మేకర్స్, తాజాగా, సహారా సంస్థ చైర్మన్ సుబ్రతా రాయ్ జీవితంపై దృష్టి పెట్టారు. జూన్ 10న ఆయన 73వ జన్మదినం సందర్భంగా మూవీ అనౌన్స్ చేయనున్నారట. అయితే, బాలీవుడ్ లో ఈ టాక్ వినిపిస్తున్నప్పటికీ… దర్శకనిర్మాతలు ఎవరు? నటీనటుల వివరాలేంటి? మొదలైన అంశాలేవీ ఇంకా బయటకు రావటం లేదు. జూన్ 10వ తేదీనే సమాచారం మొత్తం వెలువడే…
బాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్. గత తొమ్మిదేళ్ళలో చేసినవి కొన్ని చిత్రాలే అయినా అతని కంటూ ఓ గుర్తింపు ఉంది. అయితే కొంతకాలంగా అర్జున్ కపూర్ వ్యక్తిగత జీవితం… అతని ప్రొఫెషన్ కంటే కూడా ఎక్కువగా వార్తలలో నానుతోంది. దానికి తోడు ఈ పేండమిక్ సిట్యుయేషన్ లో అర్జున్ నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోది సైతం ఓటీటీకే…