బాలీవుడ్ కి, డ్రగ్స్ కి ఉండే సంబంధం ఈనాటిది కాదు. సంజయ్ దత్ మొదలు చాలా మంది బడా సెలబ్రిటీలు డ్రగ్స్ సేవించిన వారే. అయితే, డ్రగ్స్ తీసుకోవాలంటే తెచ్చే వారు కూడా ఉండాలి కదా? అలా డ్రగ్స్ సరఫరాలో కాంట్రవర్సీలు, కేసుల పాలైన బీ-టౌన్ బ్యూటీస్ కూడా ఉన్నారు. ఈ మధ్యే రియా చక్రవర్తి మత్తు పదార్థాల ఆరోపణలతో జైలుకి వెళ్లొచ్చింది. అయితే, ఆమె కంటే ముందే 2016లో డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది మమతా కులకర్ణి.
Read Also: ‘వనంగమూడి’ టీజర్ : అరవింద్ స్వామి సజీవంగా పట్టుబడతాడా?
బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరున్న మమత ఒకప్పుడు తెర మీద బిజీనే. కానీ, తరువాత క్రమంగా తెర వెనుక కార్యకలాపాలు సాగించింది. అవే ఆమెపై తీవ్రమైన కేసుల నమోదుకు కారణం అయ్యాయి. 2016 ఏప్రెల్ లో ఓ భారీ డ్రగ్ రాకెట్ బయటపడింది. 22 టన్నుల మత్తు పదార్థాలు పోలీసులకి లభించాయి. వాటి గురించి ఆరా తీస్తే చివరకు కెన్యాలో ఉండే డ్రగ్ లార్డ్ విక్కీ గోస్వామి పేరు బయటపడింది. ఆయనకు మమతా కులకర్ణి సహకరించిందని పోలీసులు గుర్తించారు. వెంటనే నోర్కోటిక్స్ చట్టం ప్రకారం కేసులు నమోదయ్యాయి. అప్పట్నుంచీ కెన్యాలోనే ఉంటోంది మమత. ఇక ఆమె పరారిని నిర్ధారించుకున్న దర్యాప్తు సంస్థలు కోర్టు ఆర్డర్స్ తో 6 బ్యాంక్ అకౌంట్స్ ని, మూడు ఖరీదైన ఫ్లాట్స్ ని సీజ్ చేయించాయి.
ఏళ్ల తరబడి తన అకౌంట్స్ , అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ ఫ్రీజై ఉండటంతో మమత కులకర్ణి లెటెస్ట్ గా తన లాయర్ సాయంతో కోర్టును ఆశ్రయించింది. డీఫ్రీజ్ చేయాలంటూ అభ్యర్థించింది. తన సోదరి ఆరోగ్యం బాగోలేదని, ఆర్దికంగా తాను ఇబ్బందుల్లో ఉన్నానని ఆమె కోర్టుకు చెప్పింది. కానీ, థానే కోర్టు ఆమె చూపిన కారణాల్ని కొట్టిపారేసింది. మమత కులకర్ణి దేశం వదిలి వెళ్లి పరారీలో ఉన్నందున ఆమె ఆస్తులు, అకౌంట్లు డీ ఫ్రీజ్ చేసే అవకాశాలే లేవని తేల్చి చెప్పింది. చూడబోతే మమత కులకర్ణి కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా కనిపించటం లేదు. ఆమె తిరిగి ఇండియాకి రావటం కూడా దాదాపు అసాధ్యమే!