సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాదు భలే కామెడీగా కూడా నవ్విస్తుంది సారా అలీఖాన్. స్టార్ కిడ్ అయినప్పటికీ పెద్దగా భేషజాలకు పోదు ఈ నవాబ్ ఖాన్ దాన్ లాడ్లీ. అప్పుడప్పుడూ ఆమె చెప్పే ‘నాక్ నాక్’ జోక్స్ నెటిజన్స్ లో బాగా పాప్యులర్. అయితే, ఈసారి సారా సింపుల్ గా “నాక్ నాక్” అంటూ జోక్ చెప్పకుండా “నాక్ అవుట్” అనేసి షాకిచ్చింది!
సారా తన తాజా ఇన్ స్టాగ్రామ్ వీడియోలో ముక్కుకి బ్యాండేజ్ తో కనిపించింది. ”నాక్ నాక్ కాదు నాక్ అవుట్” అంటూ రక్తం చిందిన ముక్కును చూపించింది. చాలా మంది ఆమె ఫన్నీ వీడియోని ఎంజాయ్ చేసినప్పటికీ కొందరు మాత్రం ‘టేక్ కేర్’ అంటూ జాగ్రత్త చెప్పారు. ఇంతకీ, ముక్కుకి ఆ గాయం ఎలా అయిందో సారా చెప్పేలేదు. కానీ, వీడియో పోస్ట్ చేస్తూ రాసిన మ్యాటర్ లో మాత్రం అమ్మ అమృతా సింగ్, నాన్న సైఫ్ అలీఖాన్, తమ్ముడు ఇబ్రహీమ్ కు సారీ చెప్పింది సారా! “నాక్ ఖట్వా దీ మైనే” అంటూ మిమ్మల్ని అవమానంతో తల దించుకునేలా చేసినందుకు క్షమాపణలు అంది, కొంటెగా!
సొషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫాలోయర్స్ ను అలరించే అందాల రాశి సారా… త్వరలో అక్షయ్ కుమార్, ధనుష్ హీరోలుగా రూపొందిన ‘అత్రంగీ రే’ సినిమాలో కనిపించనుంది.
A post shared by Sara Ali Khan (@saraalikhan95)